ఓటుకు నోటు కేసులో రేవంత్ కాల్ డేటా... ఏసిబి కోర్టుకు బిఎస్ఎన్ఎల్ నోడల్ అధికారి బాల్ సింగ్

By Arun Kumar PFirst Published Jul 14, 2021, 11:23 AM IST
Highlights

ఓటుకు నోటు కేసులో టిడిపి నాయకులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యతో పాటు ఉదయసింహ తదితరుల ఫోన్ కాల్ డేటాను ఏసిబి సేకరించి కోర్టుకు సమర్పించింది. 

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో బిఎస్ఎన్ఎల్ నోడల్ అధికారి బాల్ సింగ్, సచివాలయ సెక్షన్ ఆఫీసర్(ఎస్వో) లక్ష్మీపతిని ఏసిబి ప్రత్యేక కోర్టు మంగళవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వారిద్దరు తెలపగా వాంగ్మూలాన్ని నమోదు చేసింది న్యాయస్థానం. 

ఓటుకు నోటు కేసులో ఫోన్ కాల్ సంబాషణలు కీలకమైనవి. ఈ నేపథ్యంలోనే ఆనాటి టిడిపి నాయకులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యతో పాటు ఉదయసింహ తదితరుల ఫోన్ కాల్ డేటాను ఏసిబి సేకరించింది. ఈ సమాచారాన్ని కోర్టుకు అప్పగించింది ఏసిబి. ఈ క్రమంలోనే మరిన్ని వివరాలను బీఎస్ఎన్‌ఎల్‌ నోడల్‌ అధికారి బాల్‌ సింగ్‌ నుండి సేకరించింది. 

ఇక ఓటుకు నోటు సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఏసీబీకి సచివాలయ ఎస్‌వో లక్ష్మీపతి అందజేశారు. ఆయన వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. అనంతరం కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది ఏసిబి న్యాయస్థానం. 

read more  రేవంత్ దూకుడు: కొండా సురేఖ సహా హుజారాబాదు ఎన్నికలకు మండల ఇంచార్జీలు

ఇదిలావుంటే ఇటీవలే ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. కేసును విచారించే పరిధి ఎసీబీ కోర్టుకు లేదంటూ ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. 

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని లేదా ఓటింగ్ ను బహిష్కరించాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టారనే అభియోగాలతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 

అయితే, ఇది ఎన్నికలకు సంబంధించిన కేసులను విచారించే కోర్టు పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జనవరి 21వ తేదీన ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు జనవరి 21వ తేదీన కొట్టేసింది. 

దాంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లంచం ఇచ్చే కేసులు ఐపీసీసోలని సెక్షన్ 171 -బి కిందికి వస్తాయని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అందువల్ల కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని ఆయన కోరారు. 

అయితే, ఈ కేసుోల ఏ2, ఏ3, ఏ4గా ఉన్నవారు వేసిన డిశ్చార్జీ పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేసిందని ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్ రావు వాదించారు. ఈ ఉత్తర్వులను హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ఇవే అంశాలను ఈ కేసులోనూ ప్రస్తావించారని చెప్పారు. 


 

click me!