ఈఎస్ఐ స్కాంలో ట్విస్ట్: నిందితులకు ఏసీబీ షాక్.. ఆస్తుల జప్తు

Siva Kodati |  
Published : Sep 08, 2020, 08:17 PM IST
ఈఎస్ఐ స్కాంలో ట్విస్ట్: నిందితులకు ఏసీబీ షాక్.. ఆస్తుల జప్తు

సారాంశం

తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను ఏసీబీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. ఆస్తుల జప్తుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ ఇటీవల లేఖ రాసింది.

తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను ఏసీబీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. ఆస్తుల జప్తుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ ఇటీవల లేఖ రాసింది.

ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీలకు చెందిన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పద్మ ఆమె కుటుంబసభ్యులు బినామీల పేరిట వున్న 8.5 కోట్ల ఆస్తులతో పాటు నాగలక్ష్మీకి చెందిన 2.7 కోట్ల ఆస్తులను జప్తు చేశారు అధికారులు. 

అంతకుముందు తెలంగాణ ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవీకారాణి అక్రమాస్తులపై ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేవికారాణి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టుగా ఏసీబబీ గుర్తించింది.

Also Read:తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ట్విస్ట్: బిల్డర్ వద్ద రూ. 4 కోట్లు సీజ్

ఈ బంగారు ఆభరణాలను ప్రస్తుతం మాయమైపోయినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. హిమయత్ నగర్ లోని సీఎంజే జ్యూయలర్స్ దుకాణంలో రూ. 10 కోట్ల విలువైన ఆభరణాలను దేవికారాణి కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఈ బంగారు ఆభరణాలు ఆచూకీ కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

దేవికారాణి కుటుంబసభ్యులను ఈ బంగారు ఆభరణాల గురించి ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కమర్షియల్ ప్లాట్ నిర్మాణం కోసం దేవికారాణి ఓ బిల్డర్ కు రూ. 3.47 కోట్లను ఇచ్చింది. ఈ నెల 1వ తేదీన బిల్డర్ నుండి రూ.4 కోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

అంతేకాదు  బిల్డర్ ను కూడ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడ దేవికారాణి పెట్టుబడులు పెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu