రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

Siva Kodati |  
Published : Oct 21, 2021, 09:36 PM IST
రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

సారాంశం

హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్‌ (rajendra nagar) సబ్‌‌రిజిస్ట్రార్‌ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. 

హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్‌ (rajendra nagar) సబ్‌‌రిజిస్ట్రార్‌ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని డాక్యుమెంట్‌ రైటర్‌ వాసు ద్వారా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రార్ ఫోన్‌లో కీలక ఆధారాలు వున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆ ఫోన్‌ను రిజిస్ట్రార్ మాయం చేశారనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu