ఈఎస్ఐ స్కాం: చంచల్‌గూడ జైలు నుండి ఏసీబీ కస్టడీకి నిందితులు

By narsimha lodeFirst Published Oct 9, 2019, 11:25 AM IST
Highlights

ఏసీబీ అధికారులు బుధవారం నాడు ఈఎస్ఐ స్కాం నిందితులను తమ కస్టడీలోకి తీసుకొన్నారు. రెండు రోజుల పాటు వారిని విచారించనున్నారు. 


హైదరాబాద్: ఈఎస్ఐ స్కాం నిందితులను బుధవారం  నాడు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈఎస్ఐ స్కాంలో  ఇప్పటికే ఏసీబీ అధికారులు 13 మందిని అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఈఎస్ఐ డైరెక్టర్‌ దేవికారాణి సహా మరో 13 మందిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

ఈ కేసులో రిమాండ్ లో ఉన్న వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ  ఏసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. కోర్టు రెండు రోజుల పాటు ఈఎస్ఐ స్కాంలో ప్రమేయం ఉన్న నిందితులను విచారణ చేసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది.

కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ స్కాంలో నిందితులను చంచల్ గూడ జైలు నుండి ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు. రెండు రోజుల పాటు ఈ స్కాం గురించి పూర్తి ఆధారాల కోసం విచారణ చేయనున్నారు.

ఈఎస్ఐ అధికారుల బీనామీలే  ఫార్మా కంపెనీలను నడుపుతున్న విషయాన్ని  ఏసీబీ గుర్తించారు.  ఇంకా  ఈ కేసు విషయమై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే రెండు రోజుల పాటు విచారణ చేయనున్నారు.


 

click me!