మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ శ్రేణుల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..

Published : Mar 28, 2023, 11:13 AM IST
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ శ్రేణుల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఏబీవీపీ శ్రేణులు.. ఈరోజు ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు.దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఏబీవీపీ శ్రేణులు.. ఈరోజు ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఏబీవీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందురు ఏబీవీపీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసినవారి సంఖ్య 15 కు చేరింది.అయితే ఈ కేసును లోతుగా విచారిస్తున్న కొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ కేసులో తొలుత 9 మందిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత మరికొందరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తొలుత అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా వారిలో నలుగురు నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్‌లను మూడు రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు ఈ నెల 25న కోర్టు అనుమతించింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి కీలకంగా ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కస్టడీలోకి తీసుకున్న నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరో ముగ్గురిని  కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరి కస్టడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరి అరెస్ట్‌లు జరిగే అవకాశం కనిపిస్తుంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు