సీఎం కేసీఆర్ స‌భ‌లో యువ‌కుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Published : Aug 30, 2022, 12:14 PM ISTUpdated : Aug 30, 2022, 12:15 PM IST
సీఎం కేసీఆర్ స‌భ‌లో యువ‌కుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

సారాంశం

సోమవారం పెద్దపల్లిలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా చూశారు. 

పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలో సీఎం కేసీఆర్ సోమవారం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ నిరుద్యోగి త‌న శ‌రీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో వెంట‌నే పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆ స‌భకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

శారీరక సంబంధానికి ముందు ఆధార్, పాన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంత‌కుంట మండలానికి చెందిన పెరుమాండల్ 40 ఏళ్ల రమేష్ త‌న గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొంతకాలంగా ఉద్యోగ ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇటీవ‌లే కళాకారుడైన తన తండ్రి మల్లయ్య చ‌నిపోయాడు. దీంతో అత‌డు తీవ్రంగా నిరాశ‌కు గురయ్యాడు. దీంతో పాటు పక్షవాతంతో బాధపడుతున్న అతడి తల్లి, మ‌రో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.

కోడల్ని అత్తింట్లోకి పంపిన బుల్ డోజర్.. విషయం ఏంటంటే...

తనకు సాయం చేయాల‌ని కోరుతూ లేఖతో పాటు సీఎం కేసీఆర్ ను క‌ల‌వ‌డానికి ర‌మేష్ పెద్దపల్లి జిల్లా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో పాటు ఆత్మహత్య చేసుకునేందుకు తన వెంట కిరోసిన్ బాటిల్ కూడా తెచ్చుకున్నారు. పోలీసులు అత‌డిని స్టేజి దగ్గరకు చేరుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో ఆ కిరోసిన బాటిల్ మూత తెరిచి ఆత్మహత్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. వెంట‌నే అక్క‌డున్న రమేష్ ను ప‌ట్టుకున్నారు. అక్కడ ఎలాంటి గందరగోళ ప‌రిస్థితులు నెల‌కొన‌కుండా సభా వేదిక నుంచి బయటకు తీసుకెళ్లారు.

సెప్టెంబర్ 3న టీఆర్ఎస్ ఎల్పీ భేటీ: కీలక అంశాలపై చర్చ

ఈ ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారి సెల్‌ఫోన్లను కూడా పోలీసులు లాక్కున్నారు. సీఎం సహాయనిధి కింద త‌న‌కు సాయం అందించాలని పలుమార్లు రమేష్‌ తన సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే  వారి నుంచి ఎలాంటి స్పంద‌నా లేక‌పోవ‌డంతో ర‌మేష్ ఈ ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?