పెళ్లి కానుకగా 5 లీటర్ల పెట్రోలు.. చూసి షాక్ అయిన వరుడు..

Published : Jul 29, 2021, 09:49 AM IST
పెళ్లి కానుకగా 5 లీటర్ల పెట్రోలు.. చూసి షాక్ అయిన వరుడు..

సారాంశం

కోహిర్ గ్రామానికి చెందిన వరుడు సయ్యద్ రాయెజ్‌కి కాంగ్రెస్ పార్టీకి చెందిన అతని స్నేహితులు ప్లాస్టిక్ డబ్బాలో పెట్రోల్ ను బహుమతి ఇచ్చారు. 

సంగారెడ్డి జిల్లా కోహిర్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి కొడుకుకు అతని స్నేహితులు బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. స్టేజ్ మీదే అతనిదో గిఫ్ట్ ఓపెన్ చేయించడంతో అది చూసి అతను షాక్ అయ్యాడు.

పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా... ధరల మీద సెటైర్ గా 5 లీటర్ల పెట్రోల్ ను వరుడికి బహుమతిగా అందించారు. కోహిర్ గ్రామానికి చెందిన వరుడు సయ్యద్ రాయెజ్‌కి కాంగ్రెస్ పార్టీకి చెందిన అతని స్నేహితులు ప్లాస్టిక్ డబ్బాలో పెట్రోల్ ను బహుమతి ఇచ్చారు. 

"పెట్రోల్ ధరను పెంచడం ద్వారా సామాన్యుల మీద భారం పడదని కేంద్రంలోని ప్రభుత్వానికి చెప్పడమే మా ఉద్దేశ్యం అన్నారు. అయితే ధర తగ్గించాలి, ”అని తన స్నేహితులతో వివాహానికి హాజరైన మొహమ్మద్ మొహ్సిన్ చెప్పాడు.అయితే పెట్రోల్ బహుమతిగా అందుకున్న వరుడు టిఆర్‌ఎస్‌కు చెందినవాడవడం ఇక్కడ కొసమెరుపు. వలీమా సమయంలో ఈగిఫ్ట్ ను వారు ఇవ్వడం, వరుడు తీసుకుని విప్పి చూసి ఆశ్చర్యపడడం జరిగాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్