తొమ్మిదేళ్ల చిన్నారిపై కానిస్టేబుల్ అభ్యర్థి అత్యాచారం...

Published : Mar 10, 2019, 01:08 PM IST
తొమ్మిదేళ్ల చిన్నారిపై కానిస్టేబుల్ అభ్యర్థి అత్యాచారం...

సారాంశం

అతడు బీటెక్ చదివి తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో అర్హత కూడా సాధించాడు. ఇలా తాను కలగన్న ఉద్యోగానికి చేరువవుతున్న సమయంలో తన కామవాంఛతో దారుణానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని ఓ తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

సైదాబాద్ లో కుటుంబంతో కలిసి నివాసముంటున్న శ్రీను నాయక్(24) బీటెక్ పూర్తిచేశాడు. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ప్రిఫేర్ అవుతూ ఇటీవల జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో అర్హత సాధించాడు. త్వరలో జరగనున్న ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంటివద్దే వుంటున్నాడు. 

ఇతడి కుటుంబం ఇంటి వద్దే ఓ కిరాణ షాప్ నడుపుతున్నారు. అయితే గత శుక్రవారం బంధువుల ఇంట్లో పెళ్లి వుండటంతో కుటుంబ సభ్యులంతా దేవరకొండకు వెళ్లారు. దీంతో శ్రీను కిరాణా షాప్ లో కూర్చున్నాడు. 

ఇతడు షాప్ లో వుండగా ఓ తొమ్మిదేళ్ల బాలిక తన సోదరుడితో కలిసి ఆడుకుంటుండగా గమనించాడు. దీంతో ఆ పాపపై కన్నేసిన శ్రీను చాక్లెట్లు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.  

ఈ లైంగిక దాడి కారణంగా బాలికకు తీవ్ర రక్తస్రావమై నొప్పితో విలవిల్లాడుతూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో వెంటనే బాలికను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు నిందితుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న శ్రీను నాయక్ కోసం గాలిస్తున్నారు. 
   
PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?