నిజామాబాద్‌ జిల్లాలో కరోనా కలకలం: పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా

Published : Apr 04, 2021, 12:01 PM ISTUpdated : Apr 04, 2021, 12:17 PM IST
నిజామాబాద్‌ జిల్లాలో కరోనా కలకలం: పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా

సారాంశం

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో కరోనా కలకలం రేపుతోంది. ఓ పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా సోకింది.  మిగిలినవారికి కూడ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో కరోనా కలకలం రేపుతోంది. ఓ పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా సోకింది.  మిగిలినవారికి కూడ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ లతో పాటు , భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయినా కూడ  కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ప్రజలు వ్యవహరిస్తున్నారని ఈ ఘటన రుజువు చేస్తోందని  అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ కు పరిమిత సంఖ్యలోనే హాజరు కావాలని  అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని కూడ  ప్రధాని మోడీ  ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.  

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...