ఒక్క వాహనంపై 80 పెండింగ్ చలానాలు

Published : Jan 05, 2019, 11:08 AM IST
ఒక్క వాహనంపై 80 పెండింగ్ చలానాలు

సారాంశం

ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఒక వాహనంపై 60 పెండింగ్ చలానాలు ఉన్న ఓ వాహనాన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. 


ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఒక వాహనంపై 60 పెండింగ్ చలానాలు ఉన్న ఓ వాహనాన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా 80 పెండింగ్ చలానాలు ఉన్న మరో వాహనదారుడిని పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్ ప్యాట్నీ చౌరస్తా ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టగా.. ఈ వాహనదారుడు దొరికాడు. టీఎస్ 10ఈఎల్ 4152 నెంబర్ గల వాహనంపై వెళుతున్న విశాల్ అనే యువకుడుని  ఆపి తనిఖీ చేయగా.. అతని వాహనంపై 80 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది. వాహనదారుడి చలనాల మొత్తం రూ.12,630 ఉండగా.. వాటిని అతను చెల్లించిటనట్లు పోలీసులు తెలిపారు. ఒక వాహనంపై ఇన్ని పెండింగ్ చలానాలు ఉండటం నగరంలో ఇదే మొదటిదని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు స‌దుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?