జీహెచ్ఎంసీ ఎన్నికలు: 68 నామినేషన్లు తిరస్కరణ

Siva Kodati |  
Published : Nov 21, 2020, 11:10 PM ISTUpdated : Nov 21, 2020, 11:11 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: 68 నామినేషన్లు తిరస్కరణ

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో 68 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో 68 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

దీంతో బీజేపీ 539, టీఆర్ఎస్ 527, కాంగ్రెస్‌ 348, టీడీపీ 202, ఎంఐఎం 72, సీపీఐ 22, సీపీఎం 19, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 143, స్వతంత్ర అభ్యర్థులు 613 నామినేషన్లు సవ్యంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడువుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది.  
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!