కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి, 6సార్లు గెలిచి రికార్డు

By team telugu  |  First Published Aug 8, 2020, 12:41 PM IST

నగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య కరోనా సోకి మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. 


నగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య కరోనా సోకి మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. అనారోగ్యంతో బాధ పడుతూ 10 రోజుల కింద నిమ్స్ లో చేరగా....  పరీక్షల అనంతరం వైద్యులు ఆయనకు కరోనో పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన నిమ్స్ లోనే మరణించారు. 

నంది ఎల్లయ్య హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతంలో జన్మించారు. ఆయన మొత్తంగా ఆరుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాడు. 6,7,9,10,11 లోక్ సభలకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. దళిత నేతగా, దళితుల అభ్యున్నతికి నంది ఎల్లయ్య ఎంతో కృషి చేసారు. 

Latest Videos

ఇకపోతే.... తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో 2257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77513కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో మరో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 615కు చేరుకుంది. గత 24 గంటల్లో హైదరాబాదులో 500కు తక్కువగా కేసులు నమోదు కావడం విశేషం. 

జిహెచ్ఎంసీ పరిధిలో 464 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కరీంనగర్ లో సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, వరంగల్ అర్భన్ జిల్లాల్లో యధాస్థితి కొనసాగుతోంది. 

మేడ్చెల్ మల్కాజిరిగి జిల్లాలో 138 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 181 కేసులు రికార్డయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 187 కేసులు నమోదయ్యాయి.

click me!