హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్, ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ ప్రతిపాదలను సిద్ధం చేస్తోంది. టీఎస్‌ఐఐసీ 5 స్టార్ డీలక్స్ హోటల్ నిర్మాణం కోసం డెవలపర్‌ల నుంచి బిడ్‌లను ఆహ్వానిస్తోంది.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) ఇటీవలే ₹500 కోట్ల విలువైన ఓ ప్రాసెస్‌ను ప్రారంభించడంతో.. రాబోయే సంవత్సరాలలో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, రాయదుర్గం స్కైలైన్‌లో ఫైవ్ స్టార్ హోటల్, ట్రేడ్ సెంటర్ నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక, అనుబంధ మైలిక సదుపాయాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ, మైండ్ స్పేస్ రోటరీ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్, ఐకియా స్టోర్, ఐటీ పార్కులు వున్న ఈ ప్రాంతంలో ల్యాండ్‌మార్క్ టీ హబ్ 2.0 నిర్మాణానికి సమీపంలో ప్రాజెక్ట్ కోసం దాదాపు 3 ఎకరాలను కేటాయించింది.
ఈ ప్రాజెక్ట్ దాదాపు 3.63 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 200 కీ.. ఫైవ్ స్టార్ హోటల్‌ను కలిగి వుంటుంది. వాణిజ్య కేంద్రం కోసం 2.42 లక్షల చదరపు అడుగుల గ్రేడ్ ఏ వాణిజ్య స్థలం, 0.61 లక్షల చదరపు అడుగుల గ్రౌండ్ ఫ్లోర్‌లో హోటల్‌తో పాటు ట్రేడ్ సెండర్‌ను అందించడానికి బాంక్వెట్ హాల్, రిటైల్ అండ్ గ్రాండ్ లాబీ స్పేస్‌లు వున్నాయి. టీఎస్‌ఐఐసీ 5 స్టార్ డీలక్స్ హోటల్ నిర్మాణం కోసం డెవలపర్‌ల నుంచి బిడ్‌లను ఆహ్వానిస్తోంది.
undefined
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో లైన్ కూడా రూపుదిద్దుకున్నప్పుడు ప్రాజెక్ట్ ఊపందుకుంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ఈవెంట్‌ల కోసం నగరంలో కన్వెన్షన్ , ఎగ్జిబిషన్ సెంటర్‌గా వున్న హైటెక్స్‌కు లేని ప్రయోజనం దీనికి వుంది. విశాలమైన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఎన్నో ప్రధాన సమావేశాలను నిర్వహించింది. ప్రతి ఏడాది సగటున 4 లక్షల మంది ప్రతినిధులను నగరానికి తీసుకొస్తోంది.
టీఎస్‌ఐఐసీ పత్రాల ప్రకారం.. 60 మీటర్ ఎత్తుతో, 15 అంతస్తుల టవర్ ను నిర్మించనున్నారు. దీనికి అన్ని వైపులా 17 మీటర్ల సెట్ బ్యాక్ రూపొందించారు. గ్రేడ్ ఏ కమర్షియల్ స్పేస్ కోసం ఫ్లోర్ ఎత్తు 4 మీటర్లు . నిర్మాణ ప్రాంతం దాదాపు 6.66 లక్షల చదరపు అడుగులు కాగా.. పార్కింగ్ ప్లేస్ 8.86 లక్షల చదరపు అడుగులు. హైదరాబాద్ నగరం ప్రతి ఏడాది అనేక గ్లోబల్ ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 33 నమోదిత హోటళ్లు (5,600 గదులు).. 2,300కు పైగా నమోదు కానీ హోటళ్లు (21000 గదులు)తో హోటల్ అండ్ హాస్పిటాలిటీ మౌలిక సదుపాయాలను కలిగి వుంది.