తెలంగాణలో కొత్తగా 49 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దాంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరుకుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 11 మంది మరణించారు.
హైదరాబాద్: తెలంగాణలో తాజాగా 49 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఇప్పటి వరకు 397 యాక్టివ్ కేసులున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినవారిలో ఎవరు కూడా ఐసీయూలో లేరని ఆయన బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో చెప్పారు.
మొత్తం 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొంది 45 డిశ్చార్జి అయినట్లు ఆయన తెలిపారు. కరోనా నెగెటివ్ వచ్చినవాళ్లు కూడా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.
మర్కజ్ నుంచి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించామని, వారితో కాంటాక్ట్ అియన 3158 మందిని కూడా క్వారంటైన్ చేశామని ఆయన చెప్పారు. ఈ రోజు 500కు పైగా శాంపిల్స్ సేకరించినట్లు ఆయన తెలిపారు. 15 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మందుల కొరత లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో కొత్తగా కేసులు రాకపోవచ్చునని, త్వరలోనే ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశఆరు.