కొత్తగా 455 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,45,406కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 01, 2021, 09:43 PM ISTUpdated : Aug 01, 2021, 09:44 PM IST
కొత్తగా 455 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,45,406కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 455 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 648 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,873 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 83,763 కరోనా టెస్టులు నిర్వహించగా, కొత్తగా 455 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,45,406కి చేరింది. నిన్న కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,32,728కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 8,873 యాక్టివ్ కేసులున్నాయి. అటు కరోనా మృతుల సంఖ్య 3,805కి చేరింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 77, జగిత్యాల 22, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 35, ఖమ్మం 41, మహబూబ్‌నగర్ 9, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 4, మంచిర్యాల 10, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 31, ములుగు 5, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 21, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 8, పెద్దపల్లి 24, సిరిసిల్ల 20, రంగారెడ్డి 27, సిద్దిపేట 11, సంగారెడ్డి 8, సూర్యాపేట 17, వికారాబాద్ 2, వనపర్తి 1, వరంగల్ రూరల్ 15, వరంగల్ అర్బన్ 28, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే