మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం... వరద నీటిలో చిక్కుకున్న 28మంది (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 23, 2021, 9:56 AM IST
Highlights

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో మంథని వద్ద ఓ దేవాలయం చుట్టూ వరద నీరు చేరడంతో 28మంది చిక్కుకున్నారు. 

పెద్దపల్లి: రాష్ట్రంలోనే కాదు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో నదిలో నీటి ఉధృతి పెరిగి జనావాసాలపై పోటెత్తుతోంది. ఇలా పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదారి ఉగ్రరూపం దాల్చింది. నది జలాల్లో సుమారు 28మంది జిక్కుకున్నారు. 
 
మంథని సమీపంలో గోదావరి నది ఒడ్డున ప్రాచీనమైన గౌతమేశ్వర స్వామి దేవాలయం వుంది. ఈ దేవాలయంలో పనిచేసే అర్చకుడు కుటుంబంతో కలిసి ఇదే అక్కడే నివాసం వుంటున్నాడు. అయితే రాత్రికిరాత్రి గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆలయం చుట్టూ వరదనీరు చేరడంతో అర్చకుడి కుటుంబంతో పాటు కొంతమంది భక్తులు, జాలర్లు చిక్కుకున్నారు. 

వీడియో

అర్చకుడితో సహా కుటుంబసభ్యులు 10 మంది, గురువారం రాత్రి దేవాలయంలో నిద్రకు వెళ్లిన 8మంది గోదావరి వరదలో చిక్కుకున్నారు. అలాగే చేపల వేటకు నదిలోకి వెళ్లిన కొందరు నీటిప్రవాహం పెరగడంతో దేవాలయం వద్దకు వెళ్లారు. ఇలా మొత్తం 28మంది గోదావరి వరదల్లో చిక్కుకున్నారు. 

గోదావరిలో చిక్కుకున్నవారు బిక్కుబిక్కుమంటూ  ప్రాణాలను అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కాపాడేందుకు స్థానిక అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గోదావరిలో చిక్కుకున్నవారికి కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకురావాలని మంథని వాసులు కోరుతున్నారు. 

click me!