పగలంతా బుద్దిమంతుడిలా టీలు అమ్ముతూ.. రాత్రుళ్లు దొంగతనాలు.. 32 కేసులు, 25 సార్లు జైలుకు.. అయినా..

By SumaBala BukkaFirst Published Jan 20, 2022, 11:00 AM IST
Highlights

ఇద్దరూ భార్యాభర్తలుగా చలామణి అవుతూ చోరీ సొత్తును తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. డిసెంబర్ 23న చిలకలగూడ ఠాణా పరిధి పద్మారావు నగర్ లో ఇంటి తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారు నగలు  అపహరించారు. 

సికింద్రాబాద్ :  అతను 32 theft కేసులో నిందితుడు 25 సార్లు imprisonment,కెళ్లి వచ్చాడు. అతని ప్రవర్తన మార్చాలని pd act పెట్టారు. ఉపాధి కోసం Tea stall పెట్టించారు. అయినా అతని తీరు మార్చుకోలేదు. మళ్లీ చోరీలకు తెగబడ్డాడు. ఓ ఇంటికి కన్నం వేసిన కేసులో పోలీసులకు చిక్కాడు.

గోపాలపురం ఏసిపి సుదీర్, చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..  వికారాబాద్ మైలార్ దేవ్ పల్లికి చెంది కొమ్మాని శ్రీనివాస్ (33).. తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని చోరీలు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన కనుమర్తి ప్రియా అలియాస్ కస్తూరి అలియాస్ మోటీ (27) అతనితో సహజీవనం చేస్తోంది.

ఇద్దరూ భార్యాభర్తలుగా చలామణి అవుతూ చోరీ సొత్తును తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. డిసెంబర్ 23న చిలకలగూడ ఠాణా పరిధి పద్మారావు నగర్ లో ఇంటి తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారు నగలు  అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా చోరీకి పాల్పడింది పాత నేరస్తుడు శ్రీనివాస్ గా నిర్ధారించారు. 

చోరీ సొత్తును టోలిచౌకి,  హుమాయున్ నగర్,  లక్డికాపూల్,  పంజాగుట్టలోని  అట్టికా గోల్డ్ కంపెనీ శాఖలో ప్రియ నేతృత్వంలో విక్రయించినట్లు గుర్తించారు. నిందితులతో పాటు ఆ గోల్డ్ కంపెనీ ఉద్యోగి మహమ్మద్ ఖాదర్ అలీలను బుధవారం అత్తాపూర్ లో అరెస్టు చేశారు. వీరి వద్దనుంచి 54 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, చోరీ సొత్తుతో కొన్న బైకు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని..  వారిని రిమాండ్ కు తరలించారు. వారికి సహకరించిన మరో వ్యక్తితో పాటు బెంగళూరులోని ఆ గోల్డ్ కంపెనీ మేనేజర్ పై కూడా కేసు నమోదు చేశారు.

ఉదయం టి అమ్మడం… రాత్రుళ్లు చోరీలు..
శ్రీనివాస్ పై గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఠాణాల్లో 32 కేసులు నమోదై ఉన్నాయి. 25 కేసులో జైలు శిక్ష అనుభవించాడు. అతనిపై పీడీయాక్ట్ నమోదుచేసి ఏడాదిపాటు జైలులో పెట్టారు. ఆ తరువాత బతుకుతెరువు ఉంటే మారతాడని రాజేంద్రనగర్ పోలీసులు టీ స్టాల్ కూడా పెట్టించారు. పొద్దంతా బుద్ధిమంతుడిలా  టీ కొట్టు నడపడం.. రాత్రయితే చోరీల బాట పట్టేవాడు.  చిలకలగూడ లో జరిగిన చోరీ కేసులో పోలీసులు వేలాది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన నిందితులను పట్టుకున్నారు.

కాగా, హైదరాబాద్ న‌గ‌రంలో దొంగ‌లు రెచ్చిపోతున్నారు. రోడ్డు మీద వెళ్తున్న మ‌హిళ‌ల మెడ‌లోని బంగారం దోచుకెళ్ల‌డ‌మే ల‌క్ష్యంగా తెగబడుతున్నారు. నిన్న ఒక్క రోజే ఒకే దొంగ ఏకంగా ఐదుగురు నుంచి గోల్డ్ చైన్లు లాక్కెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ ప‌రిధిలోని మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్ ల ప‌రిధిలో జ‌రిగింది.  ప్ర‌స్తుతం ఆ దొంగ పరారీలో ఉన్నాడు. ఈ చైన్ స్నాచింగ్ ఘ‌ట‌నలో పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఓ స్నాచ‌ర్ దొంగ‌త‌నం మొద‌లు పెట్టి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు దానిని కొన‌సాగించాడు. 

click me!