24 గంటల్లో 318 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,59,007కి చేరిన మొత్తం కరోనా కేసులు

Siva Kodati |  
Published : Sep 03, 2021, 10:15 PM IST
24 గంటల్లో 318 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,59,007కి చేరిన మొత్తం కరోనా కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 318 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 389 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం  5,736 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,829 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 318 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,59,007కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో వైరస్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో మృతి చెందిన వారి సంఖ్య 3,880కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 389 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,49,391కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,736 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !