సలసల కాగే పప్పుచారులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

First Published Jul 7, 2018, 4:53 PM IST
Highlights

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం బోజనం వండుతుంగా దారుణం జరిగింది. ఓ మూడేళ్ల చిన్నారి పప్పు గిన్నెలో పడి మృతి చెందింది.

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం భోజనం వండుతుండగా దారుణం జరిగింది. ఓ మూడేళ్ల చిన్నారి పప్పు గిన్నెలో పడి మృతి చెందింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పిట్లం మండల కేంద్రంలోని బిసి గురుకుల పాఠశాలలో శోభ, యాదులు దంపతులు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కీర్తన అనే మూడేళ్ల కూతురు ఉంది.

అయితే వారు ఇవాళ విద్యార్థుల కోసం వంట వండుతుండగా చిన్నారి కీర్తన కూడా వాళ్లతో పాటే వంటగదిలో ఆడుకుంటూ ఉంది. అప్పుడే పొయ్యిపై నుండి దించిన పప్పు బొగాని వద్దకు ఆడుకుంటూ వెళ్లిన కీర్తన ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. పాప కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు అందులోంచి బయటకు తీశారు. చికిత్స కోసం పిట్లం ప్రాథమిక కేంద్రానికి తరలించారు.

అయితే అక్కడ సరైన చికిత్స అందుబాటులో లేక చిన్నారి పరిస్థితి విషమిస్తుండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో కీర్తన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

click me!