మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు కామాంధుల పైశాచికం

Siva Kodati |  
Published : Mar 26, 2019, 07:38 AM IST
మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు కామాంధుల పైశాచికం

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన ఓ మతిస్థిమితం లేని బాలికపై కన్నేసిన ముగ్గురు కామాంధులు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను ఓ గుంతలో పడేసి పరారయ్యారు. తన కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు. ఓ గుంతలో ఏడుపు వినిపించడంతో స్థానికుల సాయంతో కుమార్తెను బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లాడు..

ఆ బాలిక కడుపు నొప్పి అని ఏడవటంతో అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. దీనిపై బాలిక తండ్రి మణుగూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్