Huzurabad bypoll: బరిలో 27 మంది ఇండిపెండెంట్లు... కమలం, కారును పోలిన గుర్తులు, ఎవరి కొంపముంచుతారో?

Siva Kodati |  
Published : Oct 17, 2021, 04:21 PM IST
Huzurabad bypoll: బరిలో 27 మంది ఇండిపెండెంట్లు... కమలం, కారును పోలిన గుర్తులు, ఎవరి కొంపముంచుతారో?

సారాంశం

హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad byPoll) పోరులో స్వతంత్ర అభ్యర్థులు (independent candidates) ప్ర‌ధాన‌ పార్టీల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లోలాగా (dubbaka bypoll) ఎక్క‌డ త‌మ‌ను దెబ్బ‌తీస్తారేమోన‌ని గుబులు చెందుతున్నారు

హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad byPoll) పోరులో స్వతంత్ర అభ్యర్థులు (independent candidates) ప్ర‌ధాన‌ పార్టీల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లోలాగా (dubbaka bypoll) ఎక్క‌డ త‌మ‌ను దెబ్బ‌తీస్తారేమోన‌ని గుబులు చెందుతున్నారు. మ‌రీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఈ టెన్షణ్ ఎక్కువైంది. దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం హుజురాబాద్ ఉపఎన్నికలోనూ రిపీట్ అవుతుందోమోనని గులాబీ నేతలు భయపడుతున్నారు.

కేవ‌లం స్వ‌తంత్ర అభ్య‌ర్థులు చీల్చిన ఓట్ల‌ కార‌ణంగానే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓట‌మిపాలైంది. ఆ ఉప ఎన్నిక‌లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 1,400  మాత్ర‌మే. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే దుబ్బాక ఉప ఎన్నికలో ఒక ఇండిపెండెంట్ అభ్య‌ర్థికి అత్య‌ధికంగా 3,500 ఓట్లు వ‌చ్చాయి. అత‌నితో పాటు అదే ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మ‌రికొంద‌రు స్వ‌తంత్రుల‌కు 500 నుంచి 2 వేల ఓట్ల వ‌ర‌కు ప‌డ్డాయి.. 

Also Read:Huzurabad Bypoll: కేసీఆర్ కు ధీటుగా... అమిత్ షా, నడ్డాలతో బిజెపి మాస్టర్ ప్లాన్

హుజూరాబాద్ బ‌రిలో ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ (bjp), టీఆర్ఎస్, కాంగ్రెస్ (congress) కాకుండా ఇత‌రులు 27 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ న‌డుస్తోంది. ప‌దుల సంఖ్య‌లో ఓట్ల తేడాతో ఎవ‌రో ఒక‌రు గెలిచినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఇండిపెండెంట్లు ఎక్క‌డ త‌మ గెలుపు అవ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తారేమోన‌ని బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పైగా కారు, క‌మ‌లం గుర్తుల‌ను పోలిన చిహ్నాలు పొందిన వారు కూడా ఈ జాబితాలో ఉండ‌టం మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతోంది. మరోవైపు తొలుత నామినేష‌న్లు వేసిన వారిని బీజేపీ, టీఆర్ఎస్ క‌ష్ట‌ప‌డి బుజ్జ‌గించడంతో కొందరు వెన‌క్కి తగ్గారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది జాబితాలో బరిలో నిలిచిన వారికి ఓట్లు ప‌డ‌కూద‌ని ప్రార్థించ‌డం త‌ప్ప చేసేదేం లేకుండాపోయింది ప్రధాన పార్టీలకు.

కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు. 

 

"

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ