మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో 250 మంది టీఆర్ఎస్‌లో చేరిక...

By Arun Kumar PFirst Published Nov 9, 2018, 5:50 PM IST
Highlights

మ‌న రాష్ట్రంలో మన పార్టీ టిఆర్ఎస్ కే ఓటేద్దామ‌ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి పిలుపునిచ్చారు .మ‌హా కూట‌మికి ఓటేస్తే, మ‌న వేలితో మ‌న క‌ళ్ళ‌ను పొడుచుకున్న‌ట్లేన‌ని చెప్పారు. బాలాన‌గ‌ర్ మండ‌లం నేర‌ళ్ళ‌ప‌ల్లి, గౌతాపూర్‌ల‌లో మంత్రి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌మ‌క్షంలో మ‌హిళ‌ల‌తోపాటు 250 మంది కాంగ్రెస్‌, టిడిపిలకు చెందిన స్థానిక గ్రామాల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు టిఆర్ఎస్ లో చేరారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... మ‌నం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సొంత పార్టీ టిఆర్ఎస్‌కే ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. మ‌న రాష్ట్రం ప‌రాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళొద్దంటే మ‌న ఓట్లు మ‌న‌మే వేసుకోవాల‌న్నారు. పరాయి పాల‌న‌లో మ‌గ్గిపోయి...నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసం ఉద్య‌మించి సాధించుకున్న తెలంగాణ మళ్లీ ఆగం కాకుండా చూడాలన్నారు. మ‌న రాష్ట్రాన్ని ప‌రాయి వాళ్ళ చేతుల్లో పెడ‌దామా? మ‌న‌ల్ని మ‌న‌మే ప‌రిపాలించుకుందామా? అంటూ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. 

మ‌హా కూట‌మికి ఓటు వేస్తే మ‌న వేలితో మ‌న క‌ళ్ళ‌ను మ‌న‌మే పొడుచుకున్న‌ట్ల‌వుతుంద‌నీ... భ‌విష్య‌త్తు అంధ‌కారం అవుతుందన్నారు. కాంగ్రెస్‌, టిడిపిల 60 ఏళ్ళ‌ పాలన కంటే కెసిఆర్ నేతృత్వంలోని కేవ‌లం నాలుగున్న‌రేళ్ళ‌ పాలనలోనే అధిక అభివృద్ది జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వివిధ ప‌థ‌కాలు కొన‌సాగాల‌ంటే...బంగారు తెలంగాణ కావాలంటే ప్ర‌తి ఒక్క‌రూ టిఆర్ఎస్‌కే ఓటు వేయాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

 నేరళ్ళ‌ప‌ల్లిలో దాదాపు 250 మంది టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్‌లో చేరారు.  సిఎం కెసిఆర్‌, మంత్రి ల‌క్ష్మారెడ్డి అభివృద్ధి ప‌నుల‌ు తమను ఆకర్షించడం వల్లే టిఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. బంగారు తెలంగాణ‌లో భాగ‌స్వాములు కావాల‌నుకునే వాళ్ళంతా టిఆర్ఎస్‌లో చేరి  త‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని లక్ష్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 

click me!