ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. ఉలిక్కిపడ్డ సూర్యాపేట

Siva Kodati |  
Published : Jan 01, 2021, 04:25 PM IST
ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. ఉలిక్కిపడ్డ సూర్యాపేట

సారాంశం

సూర్యాపేట జిల్లాలో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ సోకడం కలకలం రేపింది. కరోనా సోకినవారు ఇటీవల అంత్యక్రియల్లో పాల్గొనట్లు అధికారులు గుర్తించారు. అక్కడ అంత్యక్రియలకు హాజరైన 38 మందిలో 22 మందికి కోవిడ్ నిర్థారణ అయ్యింది.

సూర్యాపేట జిల్లాలో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ సోకడం కలకలం రేపింది. కరోనా సోకినవారు ఇటీవల అంత్యక్రియల్లో పాల్గొనట్లు అధికారులు గుర్తించారు.

అక్కడ అంత్యక్రియలకు హాజరైన 38 మందిలో 22 మందికి కోవిడ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు..  కాలనీ మొత్తం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు .

యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేస్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. 

ఇక తెలంగాణలో కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 617 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,86,815కు చేరింది. వీరిలో 2,79,456 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,815 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కారణంగా 1544 మంది ప్రాణాలు విడిచారు.

PREV
click me!

Recommended Stories

BRS vs Congress: జూపల్లి కోసం కుర్చీ సిద్ధం చేసిన కేటీఆర్| Jupalli Krishna Rao | Asianet News Telugu
టిఆర్ఎస్ పార్టీ చీఫ్ అరెస్ట్... కాళ్లుచేతులు పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు