ఎంతకి తెగించార్రా .. పురీషనాళంలో దాచి బంగారం తరలింపు , విలువ ఎంతో తెలుసా..?

Siva Kodati |  
Published : Jun 06, 2023, 05:12 PM IST
ఎంతకి తెగించార్రా ..  పురీషనాళంలో దాచి బంగారం తరలింపు , విలువ ఎంతో తెలుసా..?

సారాంశం

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని పురీళనాళంలో పుట్టి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కోటి విలువైన 1705.3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్ నెంబర్ 6E-1484‌లో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల వ్యవహారశైలి అనుమానంగా వుండటంతో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు వారిని అడ్డగించారు. 

వారిని తనిఖీ చేయగా.. పురీషనాళంలో బ్లాక్ టేప్‌తో చుట్టి బంగారం పేస్ట్‌తో కూడిన ఆరు క్యాప్సూల్స్‌ దాచినట్లు తేలింది. అనంతరం ఇద్దరు ప్రయాణీకుల నుంచి రూ.1.05 కోట్ల విలువైన 17.5.3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ కస్టమ్స్ చట్టం 1962 కింద ప్రయాణీకులిద్దరిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Rapido: ర్యాపిడో ఉప‌యోగించే మ‌హిళ‌ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. అందుబాటులోకి కొత్త స‌ర్వీస్‌