హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజున కోరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం... రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,432 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 189 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజున కోరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం... రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,432 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 189 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా వెలుగు చూసిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 2,98,453కి చేరింది.
undefined
గడిచిన 24 గంటల వ్యవధిలో మరణించిన వారితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో 1,632 మంది బాధితులు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 129 మంది కోలుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య 2,94,911కి చేరింది. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1,910 మంది చికిత్స పొందుతున్నారు. 818 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో చేసిన పరీక్షలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 86,18,845 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, రాష్ట్రంలో ప్రతి రోజూ కరోనా హెల్త్ బులెటిన్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రెండు రోజుల నుండి కరోనా హెల్త్ బులెటిన్ ఇవ్వకుండా నిలిపివేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ప్రతి వారం కరోనా హెల్త్ బులెటిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.కరోనా బులెటిన్ నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారంనాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ప్రతి రోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
సెకండ్ వేవ్ ప్రారంభమైంది ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు కోరింది. 50 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్ తీసుకొనేలా ప్రచారం చేయాలని హైకోర్టు సూచించింది.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనేలా అవకాశం కల్పించాలని హైకోర్టు తెలిపింది.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. జనం గుంపులుగా ఉండకూడదని కోరింది. వృద్దులు వ్యాక్సిన్ వేసుకొనేలా ప్రచారం చేయాలని కోరింది.