తెలంగాణలో కొత్తగా 1,707 కేసులు.. భారీగా పెరుగుతున్న రికవరీలు

Siva Kodati |  
Published : Jun 11, 2021, 08:48 PM ISTUpdated : Jun 11, 2021, 08:49 PM IST
తెలంగాణలో కొత్తగా 1,707 కేసులు.. భారీగా పెరుగుతున్న రికవరీలు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,24,066 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,707  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,24,066 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,707  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 16 మంది మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,456కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 2,493 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.   

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 95, జీహెచ్ఎంసీ 158, జగిత్యాల 32, జనగామ 16, జయశంకర్ భూపాలపల్లి 44, గద్వాల 17, కామారెడ్డి 6, కరీంనగర్ 84, ఖమ్మం 124, మహబూబ్‌నగర్ 54, ఆసిఫాబాద్ 6, మహబూబాబాద్ 81, మంచిర్యాల 70, మెదక్ 13, మేడ్చల్ మల్కాజిగిరి 79, ములుగు 39, నాగర్ కర్నూల్ 30, నల్గగొండ 147, నారాయణపేట 12, నిర్మల్ 5, నిజామాబాద్ 13, పెద్దపల్లి 66, సిరిసిల్ల 38, రంగారెడ్డి 96, సిద్దిపేట 67, సంగారెడ్డి 36, సూర్యాపేట 68, వికారాబాద్ 32, వనపర్తి 36, వరంగల్ రూరల్ 31, వరంగల్ అర్బన్ 67, యాదాద్రి భువనగిరిలో 40 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!