
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే బంపర్ ఆపర్ ఇచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 16 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ రైల్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు జనవరి 7 నుంచి అందుబాటులో ఉంటాయి. అప్పటినుంచి జనవరి 18వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఈ రైళ్లు తిరుగుతాయి.
హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక రైళ్లు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తిరుపతి, విశాఖపట్నం.. తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే ఈ ప్రత్యేక రైళ్లలో ముందుగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలు తెలిపారు.