వంట చేయమని పిలిచి, మనవరాలిపై తాత అత్యాచారం: గర్భందాల్చిన బాలిక

Siva Kodati |  
Published : Aug 18, 2019, 12:18 PM ISTUpdated : Aug 18, 2019, 04:59 PM IST
వంట చేయమని పిలిచి, మనవరాలిపై తాత అత్యాచారం: గర్భందాల్చిన బాలిక

సారాంశం

ఉద్యోగ జీవితంలో ఎందరితో విద్యాబుద్ధులు నేర్పించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది.. పదవీ విరమణ చేసిన ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి మనవరాలి వయస్సున్న బాలికపై అత్యాచారం చేసి, ఆమెను తల్లిని చేశాడు

ఉద్యోగ జీవితంలో ఎందరితో విద్యాబుద్ధులు నేర్పించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది.. పదవీ విరమణ చేసిన ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి మనవరాలి వయస్సున్న బాలికపై అత్యాచారం చేసి, ఆమెను తల్లిని చేశాడు.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాలకు చెందిన ఓ బాలిక స్థానిక కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతోంది. వేసవి సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు .. వరుసకు తాతయ్యే రిటైర్డ్ హెచ్ఎం బ్రహ్మం(65) ఆమెపై కన్నేశాడు.

ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు వంట చేసి పెట్టమని పిలిచి అత్యాచారం చేసి.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తనకు జరిగిన దారుణాన్ని గోప్యంగా ఉంచింది.

కాగా... పాఠశాలలు తెరిచిన తర్వాత స్కూలుకు వెళ్లిన బాలిక అస్వస్థతకు గురయ్యింది. దీనికి తోడు ఈ నెల 12న ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

హుటాహుటిన స్కూలుకు చేరుకున్న వారు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు నాలుగు నెలల గర్బిణీగా తేల్చారు... బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో ఆమె అసలు విషయం చెప్పింది.

అయితే నేరం కప్పిపుచ్చుకునేందుకు గాను సదరు వృద్ధుడు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు బాలిక తరపునుంచి ఎటువంటి ఫిర్యాలు అందకపోవడంతో పోలీసులు సైతం మౌనం దాల్చారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు