టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్, మరో ముగ్గురికి కూడా

Siva Kodati |  
Published : Apr 05, 2023, 08:14 PM ISTUpdated : Apr 05, 2023, 10:25 PM IST
టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్, మరో ముగ్గురికి కూడా

సారాంశం

తెలంగాణ పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అటు రిమాండ్‌పై మేజిస్ట్రేట్ ఆదేశాల నేపథ్యంలో బండి సంజయ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

తెలంగాణ పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి వరంగల్ పోలీసులు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి.. మంగళవారం హైడ్రామా మధ్య హన్మకొండలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు, బండి సంజయ్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం బండి సంజయ్‌కి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 19 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులను ఖమ్మం జైలుకు తరలిస్తారనే ప్రచారం జరిగింది. అయితే సంజయ్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఆయనతో పాటు మిగిలిన నిందితులను కరీంనగర్ జైలుకు తరలించేందుకు అనుమతించారు. మరోవైపు మేజిస్ట్రేట్ నివాసం వద్ద బీఆర్ఎస్ , బీజేపీ శ్రేణులు భారీగా మోహరించారు. అటు రిమాండ్‌పై మేజిస్ట్రేట్ ఆదేశాల నేపథ్యంలో బండి సంజయ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

కాగా.. టెన్త్ పేపర్ లీక్ కేసులో సంజయ్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర పెద్దలు పరిస్ధితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశాయి. ఈ సందర్భంగా ఆయనకు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్‌ను రేపు  ఉదయం  విచారించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు  తెలిపింది. బీజేపీ  నేత  సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టులో దాఖలు  చేశారు. ఈ కేసులో బండి సంజయ్‌ని ఏ1 నిందితుడిగా చేర్చారు పోలీసులు. 

ఇక మిగతా తొమ్మిది మంది నిందితులు వీరే....

ఏ2 బూర ప్రశాంత్
ఏ3 మహేష్
ఏ4 మైనర్ బాలుడు
ఏ5 మోతం శివగణేష్
ఏ6 పోగు సుభాష్
ఏ7 పోగు శశాంక్
ఏ8 దూలం శ్రీకాంత్
ఏ9 పెరుమాండ్ల శార్మిక్
ఏ10 పోతబోయిన వసంత్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం