హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో అక్కాతమ్ముళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాది శివకుమార్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అటు సంఘవి పరిస్ధితి సైతం విషమంగానే వుంది.
హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో అక్కాతమ్ముళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాది శివకుమార్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు శివకుమార్ దాడిలో తీవ్రంగా గాయపడిన సంఘవి పరిస్ధితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ ఏఐజీలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. అయితే వెన్నెముకకు బలమైన గాయం కావడంతో ఆమె జీవితాంతం కదలకుండా వుండే పరిస్ధితి నెలకొందని ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
మరోవైపు.. శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సోదరులు శ్రీనివాస్, రోహిత్ డిమాండ్ చేశారు. సంఘవి తమ్ముడు రోహిత్ మాట్లాడుతూ.. శివకుమార్ 10వ తరగతి నుంచి తన అక్కను వేధిస్తున్నాడని తెలిపాడు. ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై సమాచారం అందిన వెంటనే.. ఎల్‌బీ నగర్‌కు చేరుకున్నట్టుగా చెప్పాడు. గది మొత్తం రక్తపు మరకలతో నిండి ఉందని.. శివకుమార్ వాళ్ల సోదరి కూడా తమ అక్కను వేధించినట్లుగా తెలిసిందని అన్నాడు. శివను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివకుమార్ బయటకు వస్తే తమ అక్కను సైతం చంపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
ALso Read: ఎల్‌బీ నగర్ ప్రేమోన్మాది ఘటన: శివ బయటకు సంఘవిని చంపేస్తాడేమో.. బాధితురాలి సోదరుడు
శ్రీనివాస్ మాట్లాడుతూ.. శివకుమార్ 10వ తరగతి నుంచే సంఘవిని వేధిస్తున్నాడని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని సంఘవి ఇంట్లో చెప్పలేదని.. చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలా చేసిందేమోనని అన్నారు. శివకుమార్ అన్యాయంగా తమ తమ్ముడిని చంపేశాడని ఆరోపించారు.