Medaram Jathara : పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ సేవలు.. జాతరకు అంతా సిద్ధం..

By SumaBala Bukka  |  First Published Feb 15, 2022, 11:26 AM IST

మేడారం జాతరకు సర్వం సిద్ధం అయ్యింది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో పాటు, యాప్ ను ప్రవేశపెట్టగా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక మేడారం జాతరలో భద్రత దృష్ట్యా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.


మేడారం :  Medaram Jatharaకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో helicopterసేవలు ప్రారంభం కానున్నాయి. Hanumakonda Arts College మైదానం నుంచి జాతరకు హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈనెల మేడారం వెళ్లలేని భక్తులు కూడా మొక్కులు చెల్లించే అవకాశం ఉంది. Courier ద్వారా ప్రసాదం ఇంటిదగ్గరికే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మీ సేవలో రూ.225  చెల్లిస్తే కొరియర్ ద్వారా ప్రసాదం పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫిబ్రవరి 13న తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాస్తున్నామని..  crowd control నియంత్రణకు 33 డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. ముప్పై మూడు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని..  ముప్పై ఏడు చోట్ల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు  పోలీస్ ఔట్పోస్టులు ఏర్పాటు చేశామని..  50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. 

Latest Videos

జాతర ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద అదునాతన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇక, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు. టిఎస్ఆర్టిసి ఎండి. సజ్జనార్ వివరాలు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సు ఎక్కాలి... అని ఆయన ప్రయాణికులకు సూచించారు. మేడారం విత్  టిఎస్ఆర్టిసి యాప్ ప్రవేశపెట్టామని..  ఆర్టీసీ చరిత్రలోనే మొదటి సారి ఈ యాప్ ను  అందుబాటులోకి తీసుకువచ్చామని  సజ్జనార్ పేర్కొన్నారు. ఈ యాప్ లో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతతో పాటు... ఇతర టూరిస్ట్ ప్రాంతాల ప్యాకేజీలతోపాటు, ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్లు, సమీపంలోని హోటల్ కాంట్రాక్టులను ఉంచామని తెలిపారు.

30 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని ఆయన గుర్తు చేశారు. మొదట రెండంకెల బస్సులతో 1970లో ప్రారంభమైందని.. ప్రస్తుతం అది 700కు పెరిగిందని అన్నారు. గతేడాది 19 లక్షలకు పైగా భక్తులు మేడారం చేర్చామని అప్పుడు మూడు వేలకు పైగా బస్సులు.. 50వేలకుపైగా ట్రిప్పులు నడిపాయి అని ఆయన వెల్లడించారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని గతేడాది 30 కోట్ల ఆదాయం వచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సారి 3845బస్సులు నడుపుతున్నామని..  మొత్తం  51 పాయింట్ల నుంచి  మేడారానికి బస్సులు తిరుగుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సు నడుపుతున్నామని సజ్జనార్ వెల్లడించారు. 

click me!