మునుగోడు ఉప ఎన్నికలు.. 289లో 104 సెన్సిటివ్ పోలింగ్ బూత్ లు.. వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం

By team telugu  |  First Published Oct 21, 2022, 5:31 AM IST

అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి అక్కడికి పోలీసులు బలగాలను మోహరించారు. 


నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 289 పోలింగ్ బూత్‌లలో 104 పోలింగ్ బూత్‌లను ‘సెన్సిటివ్’గా ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ప్రకటించింది. అలాగే ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని ఈసీ నిర్ణయించింది.

సుద్దపూసలు కాదు.. మేకవన్నె పులులు.. చేనేత కంట్లో కారం కొట్టారు: చుండూరులో ఈటెల ఘాటు వ్యాఖ్యలు

Latest Videos

అలాగే మునుగోడు నియోజకవర్గంలోని 48 గ్రామాలను కూడా ఎలక్షన్ కమిషన్ సున్నిత గ్రామాలుగా ప్రకటించింది. గత చరిత్ర, రికార్డులు, శాంతిభద్రతల సమస్యలు, నగదు, మద్యం పంపిణీని పరిగణనలోకి తీసుకుని ఈ పోలింగ్ బూత్‌లు, గ్రామాలను ‘సెన్సిటివ్ ’గా వర్గీకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయని ‘డెక్కెన్ క్రానికల్’ నివేదించింది. 

పోలింగ్‌ సరళిని పర్యవేక్షించడానికి బూత్‌లకు వెబ్-స్ట్రీమింగ్ లేదా క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలను (CCTVలు) ఏర్పాటు చేయాలని ఈసీ భావిస్తోంది. కాగా.. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, ఘట్టుపల్ అనే ఏడు మండలాలు ఉన్నాయి.

బంజారాహిల్స్ అత్యాచార ఘటనపై తమిళిసై సీరియస్... నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌కు ఆదేశం

ఉప ఎన్నిక కోసం మొత్తంగా 289 పోలింగ్ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేసింది. చౌటుప్పల్ మండలంలో అత్యధికంగా 22, మునుగోడు, చండూరులో 17, మర్రిగూడలో 14, నారాయణపురం, ఘట్టుపాల్‌లో 12, ​​నాంపల్లి మండలంలో 10 చొప్పున సెన్సిటివ్ పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. సున్నితమైన గ్రామాలకు సంబంధించి చౌటుప్పల్‌ మండలంలో అత్యధికంగా 9, మునుగోడు, చండూరులో 8, నారాయణపురంలో 7, మర్రిగూడ, నాంపల్లిలో 6, ఘట్టుప్పల్‌లో 4 ఉన్నాయి.

ఈసీ ఆదేశాల మేరకు పోలీసు శాఖ గురువారం నుంచి సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాలు, పోలింగ్ బూత్‌లలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లోని ప్రతి గ్రామానికి ఒక ఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐతో పాటు అదనంగా ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు అంతేకాకుండా ఈ మండలాల్లోని ప్రతీ చెక్‌పోస్టు వద్ద ఒక ఎస్‌ఐని నియమించారు.

ఇదేనా ప్రధాని మహిళలకు ఇచ్చే గౌరవం - బిల్కిస్ బాను కేసు దోషుల విడుదలపై మోడీపై ఖర్గే మండిపాటు

అత్యధికంగా సున్నితమైన గ్రామాలు, పోలింగ్ బూత్‌లు ఉన్న చౌటుప్పల్ మండలానికి ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 12 మంది సీఐలతో పాటు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు మొత్తం 63 మంది పోలీసు సిబ్బందిని అధికారులు నియమించారు. అలాగే ఈ మండలానికి రెండు కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు కూడా చేరుకున్నాయి. 

కాగా.. ప్రస్తుతం చౌటుప్పల్ మండలంలో 400 మంది, నారాయణపూర్‌లో 300 మంది కేంద్ర, రాష్ట్రానికి చెందిన పోలీసులు పనిచేస్తున్నారు. నారాయణపూర్‌కు ఒక డీసీపీ, ఒక ఏసీపీ, 8 మంది సీఐలు, 35 మంది ఎస్‌ఐలు, 16 మంది ఏఎస్‌ఐలను అధికారులను నియమించారు. 

click me!