తెలంగాణలో పది మంది అధికారులకు ఐఏఎస్ హోదా.. జాబితా ఇదే

By Siva KodatiFirst Published Feb 7, 2023, 7:30 PM IST
Highlights

తెలంగాణలో పది మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టిన సంగతి తెలిసిందే

తెలంగాణలో పది మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. కోరం అశోక్ రెడ్డి, బడుగు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, అరుణశ్రీ, నిర్మలా కాంతివెస్లీ, కోటా శ్రీవాత్సవ, చెక్కా ప్రియాంక, కాత్యాయని, నవీన్ నికోలస్‌లకు ఐఏఎస్ హోదా లభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso REad: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. పూర్తి వివరాలు ఇవే..

ఇకపోతే.. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టిన సంగతి తెలిసిందే. 15 మంది ఐఏఎస్‌లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హనుమంకొండ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, వికారాబాద్  కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా షేక్ యాస్మిన్ బాషా, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా జి రవి, సూర్యాపేట కలెక్టర్‌గా ఎస్ వెంకటరావు, రంగారెడ్డి  కలెక్టర్‌గా ఎస్ హరీష్, మంచిర్యాల కలెక్టర్‌గా బదావత్ సంతోష్,  నిర్మల్ కలెక్టర్‌గా కర్నటి వరుణ్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్‌గా తేజస్ నంద్‌లాల్ పవార్, మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా అమోయ్ కుమార్(తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు),  మహిళా శిశు సంక్షేమ స్పెషల్ సెక్రటరీగా భారతి హోళ్లికేరి, నిజామాబాద్ కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హనుమంతు, మెదక్ కలెక్టర్‌గా రాజార్షి షా, జగిత్యాల కలెక్టర్ (అదనపు బాధ్యతలు)  ఆర్‌వీ కర్ణన్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

click me!