ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు: ఒకరి మృతి, మరోకరికి గాయాలు

Published : Dec 30, 2019, 03:00 PM ISTUpdated : Dec 30, 2019, 03:09 PM IST
ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు: ఒకరి మృతి, మరోకరికి గాయాలు

సారాంశం

ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం నాడు జరిగిన బాంబు పేలుడులో ఒకరు మృతి చెందారు.


ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాబాద్ జిల్లా ఊట్నూరు క్రాస్ రోడ్డు వద్ద  సోమవారంనాడు ఉదయం నాటు బాంబు పేలింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాటు బాంబును ఇక్కడికి ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

నాటు బాంబును ఇక్కడికి ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు తీవ్రతకు మృతుడి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.  టూ వీలర్ పై నాటు బాంబులు తీసుకెళ్తున్న సమయంలో  నాటు బాంబులు పేలిపోయాయి.

ఊట్నూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన  చోటు చేసుకొంది. వేట కోసం వాడే నాటు బాంబులను ఉపయోగిస్తున్నారు. మృతుడిని మణిరావుగా గుర్తించారు. శనిరావు అనే వ్యక్తి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ పేలుడు పెట్రోల్ బంకు వద్ద చోటు చేసుకొంది. దీంతో అసలు ఏం జరుగుతోందోనని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.  మణిరావు  శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సులభంగా బాంబులను తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

మణిరావు,శనిరావులు టూవీలర్‌పై నాటు బాంబులను తీసుకెళ్తున్నారు. ఈ టూవీలర్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ పేరుతో ఉంది.  వేట కోసం ఈ నాటు బాంబులను ఉపయోగిస్తారని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు