మాజీ హోంమంత్రి అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు

By Arun Kumar PFirst Published Oct 23, 2020, 1:02 PM IST
Highlights

మాజీ హోంమంత్రి నాయిని మృతితో యావత్ తెలంగాణ ప్రజలు బాధలో వుండగా కొందరు జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. 

హైదరాబాద్: గురువారం మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి మృతిచెందడంతో రాష్ట్రంలో విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, కార్మిక నాయకుడిగా చేసిన పోరాటం, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు బాధలో వుండగా కొందరు జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. హైదరాబాద్ లో జరిగిన నాయిని  అంత్యక్రియల్లో పాల్గొన్న నాయకులు, సామాన్యుల జేబులను కత్తిరిస్తూ దొంగతనానికి పాల్పడి అత్యంత నీచంగా వ్యవహరించారు. 

మాజీ హోంమంత్రి నాయిని అంత్యక్రియల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసినా మంత్రులు,ఎమ్మెల్యేలు, వీఐపీలు రావడంతో వారి సెక్యూరిటీ బిజీలోనే వున్నారు. ఇదే అదునుగా భావించిన జేబుదొంగలు కొందరు నాయకులు, కార్యకర్తల జేబుల్లోంచి డబ్బును దొంగిలించారు. నాయిని ఇకలేరన్న బాధలో అక్కడున్నవారుంటే జెబుదొంగలు మాత్రం అదునుకోసం చూసి అవకాశం చిక్కగానే జేబులను కత్తిరించారు. 

ఇలా ఓ నాయకుడి జేబును కత్తిరించి నగదును తస్కరించే ప్రయత్నం చేసిన ఓ దొంగ అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వారు దేహశుద్ది చేయడమే కాదు అక్కడే విధుల్లో వున్న పోలీసులకు అప్పగించారు. ఇలా చిక్కిన దొంగను విచారించి మిగతా దొంగలను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

click me!