వంద మిలియన్ల మార్క్‌ దాటినా యుట్యూబ్.. సొంత రేడియో స్టేషన్‌ కూడా..

By Ashok kumar Sandra  |  First Published Feb 5, 2024, 11:05 AM IST

YouTube Music అండ్  Premium 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను దాటింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా అధికారులు అధికారికంగా తెలియజేశారు
 


వీడియో షేరింగ్ ఫ్లాట్ ఫార్మ్ YouTube చెందిన యుట్యూబ్  Music అండ్ Premium 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను దాటింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా అధికారులు అధికారికంగా తెలియజేశారు. 2015లో యూట్యూబ్ యూట్యూబ్ మ్యూజిక్ అనే సర్వీస్  ప్రారంభించింది. ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే, మీరు ప్రకటనలు లేకుండా బ్యాక్‌గ్రౌండ్ ప్లేతో యూట్యూబ్ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. నేడు, YouTube మ్యూజిక్ అండ్  ప్రీమియం సేవలు 100కి పైగా దేశాలు ఇంకా ప్రాంతాలలో అందుబాటులో ఉంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. జనరేటివ్ AI ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, YouTube Music కూడా పాడ్‌క్యాస్ట్ ఫీచర్‌తో వచ్చింది.

ఇంతకు ముందు క్రియేట్ వీడియో అనే ఫీచర్ యాప్ లో కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ అప్‌డేట్ ప్రత్యేకత ఏమిటంటే, కస్టమర్‌లు  స్వంత రేడియో స్టేషన్‌లను సృష్టించుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ స్వయంగా రేడియో స్టేషన్‌ను తయారు చేస్తోంది. యూజర్  పాటను ఎంచుకుని వినడం ప్రారంభించిన వెంటనే అతని కోసం రేడియో స్టేషన్ రూపొందించబడుతుంది. ఇంకా 'అప్ నెక్స్ట్' సెక్షన్‌లో తర్వాత ఏ పాట వస్తుందో చూడొచ్చు. 

Latest Videos

ఈ స్టేషన్‌ని సాధారణ ప్లేలిస్టులో సేవ్ చేయడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కొత్త అప్‌డేట్‌తో, వినియోగదారులు క్రియేట్ ఎ రేడియో ఫీచర్‌ని ఉపయోగించి తమకు ఇష్టమైన పాటలతో రేడియో స్టేషన్‌ను సృష్టించవచ్చు. ఇప్పటి నుండి మీరు YouTube Music యాప్ కింద  క్రియేట్ రేడియో కార్డ్‌ని చూస్తారు. ఈ లేబుల్‌ని యువర్ మ్యూజిక్ ట్యూనర్ అంటారు. ఒక రేడియో స్టేషన్‌లో దాదాపు 30 పాటలు ఉండోచ్చు. 

అలాగే ఇందులోని పాటలను కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన సింగర్ అండ్  మ్యూజిక్  డైరెక్టర్స్ పాటలను రేడియోలో వినమని కూడా మీరు సూచించవచ్చు. మీరు రేడియో స్టేషన్‌ని సృష్టించిన తర్వాత, ఇచ్చిన ప్రమాణాల ప్రకారం రేడియోలో కొత్త పాటలు ప్లే చేయబడతాయి.   Spotify ఇంకా Apple Musicలో ఇప్పటికే ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది.

click me!