అందరూ చూస్తున్నారని ఆందోళన అవసరం లేదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ వస్తోంది..

By Ashok kumar Sandra  |  First Published Feb 3, 2024, 5:25 PM IST

మరింత ప్రైవేట్ కంటెంట్‌ను సన్నిహితులు ఇంకా  కుటుంబ సభ్యులతో మాత్రమే షేర్ చేయాలనుకునే వారి కోసం ఈ కొత్త ఫీచర్ రూపొందించబడిందని నివేదించింది. 
 


ఇప్పుడు వాట్సాప్ లాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లను ప్రైవేట్‌గా ఉంచవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ పోస్ట్‌లను క్రియేట్ చేయడానికి  ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, దింతో సెలెక్ట్ చేసిన ఫాలోవర్లు లేదా సన్నిహితులు మాత్రమే చూడగలరు. ఈ ఫీచర్‌కి కంపెనీ పెట్టిన పేరు ఫ్లిప్‌సైడ్. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే లిమిట్ చేయబడింది, భవిష్యత్తులో వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను అందించాలని Meta నిర్ణయించింది. అయితే దీనిపై ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసెరి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం, కంపెనీ ప్రజల నుండి అభిప్రాయ సేకరణలో బిజీగా ఉంది.  

ఫ్లిప్‌సైడ్ ప్రత్యేకమైనది, ఇది ప్రైవేట్ పోస్ట్‌ల కోసం ప్రత్యేక ప్లేస్ సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ పోస్ట్‌లను తమ  ప్లాలోవర్స్  ఎవరు చూడవచ్చో యూజర్  కంట్రోల్ చేయవచ్చు. మరింత ప్రైవేట్ కంటెంట్‌ను సన్నిహితులు ఇంకా  కుటుంబ సభ్యులతో మాత్రమే షేర్ చేయాలనుకునే వారి కోసం ఈ కొత్త ఫీచర్ రూపొందించబడిందని నివేదించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం స్టోరీస్ కోసం అదే ఫీచర్‌ను ఉపయోగిస్తోంది. క్లోజ్ ఫ్రెండ్స్ అని పిలువబడే ఈ ఫీచర్‌ను స్టోరీస్ పైన  ఉన్న గ్రీన్ సింబల్  ద్వారా గుర్తించవచ్చు. కొత్త ఫ్లిప్‌సైడ్ ఫీచర్ ఇలాంటి కార్యాచరణను అందించగలదని భావిస్తున్నారు.

Latest Videos

ఇంతకుముందు, యాప్ వాట్సాప్‌లో లాగే  రీడ్ రిసీపెంట్లను ఆఫ్ చేసే అప్షన్  ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని మెట్టా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ CEO ఆడమ్ మొజారీ కూడా ప్రైవసీ ఫీచర్‌లో రాబోయే టోగుల్  స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసారు. యాప్‌లో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా తెలియలేదు, అయితే నెక్స్ట్ అప్‌డేట్‌లో  అందుబాటులోకి వస్తుందని  ఆశిస్తున్నారు. త్వరలో ఈ అప్ డేట్ ఫేస్ బుక్ మెసెంజర్ లో కూడా అందుబాటులోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

click me!