YouTube:వాటిని అరికట్టేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్‌.. ఇకపై ఈజీగా తెలిసిపోతుంది..

By asianet news telugu  |  First Published Jul 1, 2022, 1:37 PM IST

YouTube కమ్యూనిటీ పోస్ట్‌లో మూడు కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. మొదటి ఫీచర్ స్పామ్ కామెంట్‌లను అరికట్టడం, రెండవది యూట్యూబ్ ఛానెల్‌లను రన్ చేసే లేదా కామెంట్ చేసే వారి ఐడెంటిటీని దాచడం, మూడవది సబ్‌స్క్రైబర్ల కౌంట్స్ దాచడం 29 జూలై 2022 నుండి ప్రారంభమవుతుంది.
 


గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. యూట్యూబ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా ఛానెల్ లేదా వీడియోపై వచ్చే నకిలీ లేదా స్పామ్ కామెంట్‌లను అరికడుతుంది. ఛానెల్  సబ్‌స్క్రైబర్ కౌంట్‌ను ఇకపై దాచలేమని కూడా యూట్యూబ్ తెలిపింది. స్పామ్ కామెంట్స్ అరికట్టడానికి YouTube కొన్ని పదాలను ఫిల్టర్ చేసింది.

YouTube కమ్యూనిటీ పోస్ట్‌లో మూడు కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. మొదటి ఫీచర్ స్పామ్ కామెంట్‌లను అరికట్టడం, రెండవది యూట్యూబ్ ఛానెల్‌లను రన్ చేసే లేదా కామెంట్ చేసే వారి ఐడెంటిటీని దాచడం, మూడవది సబ్‌స్క్రైబర్ల కౌంట్స్ దాచడం 29 జూలై 2022 నుండి ప్రారంభమవుతుంది.

Latest Videos

undefined

కొంతమంది వారి గుర్తింపును దాచిపెట్టి కామెంట్స్ చేస్తున్నారని యూట్యూబ్ ఒక పోస్ట్‌లో పేర్కొంది. అలాంటి వారు ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఇతర ఛానెల్‌ని డౌన్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారు ఏ ఛానెల్‌లోనైనా బల్క్‌గా కామెంట్ చేస్తారు. దీని వల్ల మంచి పని చేస్తున్న చిన్న ఛానెల్‌లు నాశనం అవుతాయి. కొందరు సబ్‌స్క్రైబర్‌లను దాచుకునే కొన్ని ఛానెల్‌లు ఉన్నాయి. జూలై 29 నుంచి వీటిని నిషేధించనున్నారు.

కొన్ని రోజుల క్రితం YouTube Go యాప్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. Android Go వెర్షన్‌తో కూడిన ఫోన్‌ల కోసం YouTube Go 2016లో ప్రారంభించారు. YouTube Go చాలా తక్కువ సైజ్ లో   ఇంకా తక్కువ RAM అండ్ స్టోరేజ్ ఉన్న ఫోన్‌లకు ఈ యాప్ గొప్ప గిఫ్ట్ కంటే తక్కువ కాదు. 

యూట్యూబ్ గో ఈ ఏడాది ఆగస్ట్ 2022లో షట్ డౌన్ చేయబడుతుందని, అయితే  అకస్మాత్తుగా మూసివేయబడదని యూట్యూబ్ తెలిపింది.  ఆగస్టు ఈ యాప్ మూసివేయడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ యాప్ ఎలాంటి అప్‌డేట్‌ను పొందదు.  ఈ యాప్‌ని ఇప్పటికే వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న వారు ఉపయోగించగలరు.

click me!