నోకియా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌.. 50 మెగాపిక్సెల్ కెమెరాతో అప్‌గ్రేడ్ వెర్షన్ వచ్చేస్తోంది..

By asianet news telugu  |  First Published Jun 29, 2022, 4:37 PM IST

కొత్త ఫోన్ Nokia G11  అనేది అప్‌గ్రేడ్ వెర్షన్. Nokia G11 Plus 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది. బ్యాటరీకి సంబంధించి మూడు రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. 


హెచ్‌ఎండీకి చెందిన నోకియా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నోకియా జీ11 ప్లస్‌ను సీక్రెట్ గా లాంచ్ చేసింది. కొత్త ఫోన్ Nokia G11  అనేది అప్‌గ్రేడ్ వెర్షన్. Nokia G11 Plus 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది. బ్యాటరీకి సంబంధించి మూడు రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. అయితే నోకియా మూడు సంవత్సరాల పాటు నోకియా G11 ప్లస్ కోసం ఆండ్రాయిడ్ అప్ డేట్ ఉంటుందని చెబుతుంది.

ధర 
Nokia వెబ్‌సైట్‌లో నోకియా G11 లిస్ట్ చేసింది, అయితే ధర గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చార్‌కోల్ గ్రే, లేక్ బ్లూ కలర్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

స్పెసిఫికేషన్లు
నోకియా జీ11 ప్లస్‌ లో 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజీ ఇచ్చింది. అంతేకాకుండా Geekbench నివేదిక ప్రకారం ఈ Nokia ఫోన్‌లో డ్యూయల్ బ్యాక్ కెమెరా ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్‌లు, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
 
కనెక్టివిటీ కోసం ఇందులో 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/A-GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు, దీని బరువు 192 గ్రాములు. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందా లేదా అనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.

click me!