మీరు కూడా తక్కువ ధరలో స్టార్‌బక్స్ కాఫీ తాగాలనుకుంటున్నారా.. అయితే ఈ ఐడియాని వాడుకోవచ్చు!

By asianet news telugu  |  First Published Jun 9, 2023, 2:23 PM IST

స్టార్‌బక్స్‌లో కాఫీ ధర ఎక్కువగా ఉంటే, ఈ ప్లాన్ మీకు చాలా డబ్బు ఆదా చేస్తుంది. అలాగే, స్టార్‌బక్స్ అవుట్‌లెట్‌కి వెళ్లి హాయిగా కాఫీ తాగండి.


న్యూఢిల్లీ : కాఫీ ప్రియులు ఎల్లప్పుడూ బెస్ట్ కాఫీ కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి వారి స్వంత టెస్ట్ ఉంటుంది. కాఫీ-ప్రియుల ఆనందం కోసం దేశవ్యాప్తంగా వివిధ కాఫీ బ్రాండ్ చెయిన్‌లు ఉన్నాయి. కాఫీ డే, థర్డ్ వేవ్ కాఫీ, స్టార్ బక్స్ ఇలా ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో, స్టార్‌బక్స్ గొప్ప కాఫీకి పేరొందిన బ్రాండ్. 

అయితే, స్టార్‌బక్స్‌లో కాఫీ ధర ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు ఈ ప్లాన్ తో  చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే, మీరు స్టార్‌బక్స్ అవుట్‌లెట్‌కి వెళ్లి హాయిగా కాఫీ తాగవచ్చు! అది ఎలా అంటే.. తాజాగా ఓ వ్యక్తి స్టార్‌బక్స్‌లో తనకు ఇష్టమైన కాఫీని ఆస్వాదించడానికి వెళ్లాడు. అయితే స్టార్‌బక్స్‌లో కాఫీ ధర ఎక్కువగా ఉండటంతో డబ్బు ఆదా చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు.

Latest Videos

undefined

సందీప్ మాల్ అనే ఒక వ్యక్తి  కొంత డబ్బు ఆదా చేసేందుకు ప్రముఖ డెలివరీ యాప్ జొమాటోని ఉపయోగించి స్టార్‌బక్స్ నుండి కాఫీని ఆర్డర్ చేసిన తన అనుభవాన్ని వివరించాడు. ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు, రిప్లయ్ లు  చేస్తున్నారు. అలాగే సందీప్ మాల్ ది చాలా గొప్ప ఐడియా అని కొనియాడారు.

"స్టార్ బక్స్ లో కూర్చున్నాను - కాఫీ ధర రూ. 400. కానీ అదే కాఫీ Zomatoలో రూ. 190కి డీల్‌తో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యం Zomatoలో స్టార్‌బక్స్ చిరునామాతో ఆర్డర్ చేసాను. Zomato డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకున్నాడు, స్టార్‌బక్స్‌లోని నా టేబుల్‌కి డెలివరీ చేశాడు. ఈ డీల్ పూర్తిగా తెలివిగా ముగిసింది" అని ఆయన ట్వీట్ చేశారు. 

@SandeepMall అకౌంట్ ద్వారా ట్విటర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌కి మిలియన్ వ్యూస్, దాదాపు 10,000 లైక్‌లు వచ్చాయి.

అలాగే, స్టార్‌బక్స్ కాఫీని ఆర్డర్ చేసేటప్పుడు డబ్బు ఆదా చేయడం గురించి ఈ సంఘటనపై ఇంటర్నెట్ లో భిన్నమైన రిప్లయ్స్ వచ్చాయి. స్టార్‌బక్స్ అవుట్‌లెట్‌లో కూర్చొని జొమాటోను ఆర్డర్ చేయాలనే అతని తెలివైన ఆలోచనను చాలా మంది మెచ్చుకున్నారు.

 నిజాయితీగా చెప్పాలంటే, ఇది భారతీయుల తెలివి,  నేను దీన్ని చాలా ఇస్టపడుతున్నాను" అని ఒక యూజర్  పోస్ట్ చేసారు. "1 మిలియన్ వ్యూస్ ఇంకా చాలా ఇంప్రెసివ్. రూ. 200 తగ్గింపు మొత్తం విలువైనది" అని మరొక యూజర్ కామెంట్ చేసారు.

అలాగే, స్టార్‌బక్స్ ధరల విషయంలో వార్తల్లో నిలవడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు, కాఫీ దిగ్గజం కేవలం రెండు కాఫీలకు రూ.3.3 లక్షలు వసూలు చేసిన బిల్లు వార్తల్లో నిలిచింది.

click me!