కస్టమర్లకు బంపర్ ఆఫర్..! కేవలం రూ. 17కే ఓవర్ నైట్ ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా ప్యాక్..

VI కస్టమర్లకు బంపర్ ఆఫర్. డేటా అయిపోయే సమస్యను పరిష్కరించడానికి ఓవర్‌నైట్ అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం రూ.17 ఇంకా రూ.57కే అందుబాటులో ఉంది. 

Overnight unlimited data pack at just Rs 17, a bumper offer for VI customers!-sak

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు  కస్టమర్లకు డేటాపై ఇప్పటికే పలు ఆఫర్లు అందించాయి. ఇప్పుడు  వోడాఫోన్ ఐడియా (VI) కస్టమర్ల కోసం కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అకస్మాత్తుగా  డేటా లేకపోవడం / అయిపోవడం సమస్యను పరిష్కరించడానికి సమాజంలోని అన్ని వర్గాలకు డేటా సులభంగా ఇంకా  సరసమైన ధరలకు అందుబాటులో ఉంచింది. ఇందుకు వోడాఫోన్ ఐడియా రెండు కొత్త ఆన్ లిమిటెడ్  నైట్ డేటా ప్యాక్‌  'VI ఛోటా హీరో ప్యాక్‌'లను ప్రారంభించింది.

రూ.17 అండ్  రూ.57 రెండు కొత్త ప్యాక్‌లతో, 'VI' వినియోగదారులు అర్ధరాత్రి నుండి ఉదయం 6:00 గంటల వరకు ఆన్ లిమిటెడ్  డేటాను ఉపయోగించుకుకోవచ్చు. నేటి డిజిటల్ ప్రపంచంలో, ప్రతి ఒక్కరి రోజువారీ కార్యకలాపాలలో మొబైల్ ఇంటర్నెట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది, అది ఆఫీసు పని లేదా వినోదాన్ని ఆస్వాదించడం. హైబ్రిడ్ వర్క్ కల్చర్, విపరీతమైన కంటెంట్, సోషల్ చాట్‌లు,  వివిధ ప్రయోజనం/సమాచారం కోసం ఇంటర్నెట్ బ్రౌజింగ్, గేమింగ్ అనుభవం మొదలైన వాటి కారణంగా ప్రీపెయిడ్ కస్టమర్‌లు డైలీ డేటా అయిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 

Latest Videos

ప్రీపెయిడ్ కస్టమర్‌లు అర్ధరాత్రి నుండి ఉదయం 6:00 గంటల వరకు అపరిమిత డేటాను ఒక రోజుకి రూ .17 అలాగే వారం లేదా  7 రోజులకు రూ .57 ధరతో అత్యంత బడ్జెట్  డేటా ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆఫర్ ద్వారా కస్టమర్‌లు అపరిమిత డేటా సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించుకునేలా చేయడం ద్వారా ప్రీపెయిడ్ కస్టమర్‌లకు ముఖ్యమైన టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్‌గా మారాలని 'VI' లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్యాక్‌లు ప్రత్యేకంగా కాలేజ్ ఇంకా హాస్టల్ విద్యార్థులు, బ్రాడ్‌బ్యాండ్ సేవలను పొందలేని కొత్త ఉద్యోగుల వంటి వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి, అయితే రాత్రిపూట సినిమాలు, వీడియో చూడటం, మ్యూజిక్ వినడం, గేమ్‌లు ఆడటం, వివిధ ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ బ్రౌజింగ్, చాటింగ్ కోసం  హై స్పీడ్ డేటా అవసరం.  'VI' కస్టమర్‌లు VI గేమ్‌లను ఆడేందుకు, VI సినిమాలు & టీవీలో తాజా సినిమాలు/వీడియోలను వీక్షించడానికి ఇంకా ఆనందించడానికి లేదా VI అప్లికేషన్‌లో (యాప్‌లో) VI మ్యూజిక్ ఇష్టమైన మ్యూజిక్ ఇంకా  పాటలను వినడానికి ఈ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు.
 

vuukle one pixel image
click me!