Xiaomi 11T Pro specifications: ఎంఐ నుంచి మ‌రో కొత్త ఫోన్ లాంచ్‌.. ఎప్పుడంటే..?

By team telugu  |  First Published Jan 18, 2022, 11:33 AM IST

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ (ఎంఐ) నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవల షావోమీ 11ఐ సిరీస్‌ ( Xiaomi 11i series) ఫోన్లు వచ్చిన విషయం తెలిసిందే. హైపర్ ఛార్జ్‌ వీటి ప్రత్యేకత. అయితే షావోమీ నుంచి మరో హైపర్‌ఫోన్ (HyperPhone) రానుంది. జనవరి 19న (January 19) షావోమీ 11T ప్రో (Xiaomi 11T Pro) స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది.


స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న షావోమీ 11 టీ ప్రో 5జీ (11T Pro 5G) స్మార్ట్​ఫోన్​ రిలీజ్​ (Smartphone release date) డేట్​ ఫిక్స్​ అయ్యింది. జనవరి 19న భారత మార్కెట్​లోకి లాంచ్(Market Launch)​ చేస్తామని షావోమీ (Xiaomi) అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ ఫోన్​ను యూరప్ మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. భారత్​లో కూడా ఇవే ఫీచర్లు, ధరతో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని టెక్​ నిపుణులు చెబుతున్నారు. ఇక, షావోమీ 11టీ ప్రో గ్లోబల్ వేరియంట్ మెటోరైట్ గ్రే, మూన్‌లైట్ వైట్, సెలెస్టియల్ బ్లూ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, భారత మార్కెట్​లో ప్రస్తుతానికి గ్రే కలర్ వేరియంట్‌ మాత్రమే రిలీజ్​ కానుంది. అతి త్వరలోనే మిగిలిన కలర్​ వేరియంట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

యూరప్​లో షావోమీ 11టీ స్మార్ట్​ఫోన్​ ఇప్పటికే లాంచ్​ అయింది. యూరప్​ మార్కెట్​లో షావోమీ 11టీ ప్రో 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ 649 యూరోలు (రూ.54,500), 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ 699 యూరోలు (సుమారు రూ. 58,700), టాప్​ ఎండ్ వేరియంట్​ అయిన 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ 749 యూరోలు (సుమారు రూ. 62,900) వద్ద విడుదలయ్యాయి. 

Latest Videos

ఈ స్మార్ట్‌ఫోన్ (Smartphone) సంబంధించిన ఫీచ‌ర్స్ ఇలా ఉన్నాయి. క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 888 5జీ ప్రాసెస‌ర్‌తో (Qualcomm Snapdragon 888 5G processor) ఈ ఫోన్ రానుంది. అలాగే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన అమోఎల్ఈడీఈ డిస్‌ప్లే (120Hz AMOLED) ఉంటుంది. 120 వాట్స్‌తో (120W) ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌‌ ఈ స్మార్ట్‌ఫోన్‌కు (Xiaomi 11T Pro) ఉంటుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు అమెజాన్‌లో ప్రకటించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ 8 జీబీ ర్యామ్ (8GB RAM) 128 జీబీ స్టోరేజ్‌ (128GB storage), 8GB జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ల‌తో రానుంది. ఇక భారత్‌లో షావోమీ 11T ప్రో (Xiaomi 11T Pro) ధర రూ. 40,000 ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్టీరియో స్పీకర్ సెటప్ ఉంటుంది. 5,000 mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. 108MP మెయిన్ కెమెరా సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 5MP టెలి-మాక్రో షూటర్‌తో సహా ట్రిపుల్ కెమెరాతో ఈ ఫోన్ ఉంటుంది.

click me!