షియోమి నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Published : Jul 12, 2018, 03:01 PM IST
షియోమి నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

సారాంశం

ఇప్పటికే షియోమి నుంచి విడుదలైన అన్ని స్మార్ట్ ఫోన్లు విజయం సాధించాయి. ఈ కంపెనీ విడుదల చేసే ఫోన్లన్నీ దాదాపు బడ్జెట్ ధరలోనే ఉండటం విశేషం.  

చైనాకి  చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారా సంస్థ షియోమి.. భారత మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన ఎంఐఏ2 పేరిట ఓ స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే షియోమి నుంచి విడుదలైన అన్ని స్మార్ట్ ఫోన్లు విజయం సాధించాయి. ఈ కంపెనీ విడుదల చేసే ఫోన్లన్నీ దాదాపు బడ్జెట్ ధరలోనే ఉండటం విశేషం.

ఈ ఎంఐఏ2 కూడా బడ్జెట్ ధరలోనే లభించనున్నట్లు సమాచారం. ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఫోన్ ధర అధికారికంగా ప్రకటించనప్పటికీ.. బడ్జెట్ ధరలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

షియోమీ ఎంఐ ఎ2 ఫీచర్లు... 
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్