చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమి.. మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలో గత ఏడాది డిసెంబర్లో ఆవిష్కరించిన షావోమి 12 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకురానుందట షావోమి కంపెనీ.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమి.. మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలో గత ఏడాది డిసెంబర్లో ఆవిష్కరించిన షియోమీ 12 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకురానుందట షావోమి కంపెనీ.
గత ఏడాది ఈ సిరీస్‌లో షావోమి 12, షావోమి 12 ప్రో, షావోమి 12 ఎక్స్ వంటి వేరియంట్లు విడుదలయ్యాయి. ఇప్పుడు 'షావోమి 12 అల్ట్రా' పేరుతో కొత్త వేరియంట్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం.. ఫిబ్రవరిలో చైనాలోనే తొలుత ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల (Xiaomi 12 Ultra release date) కానుంది. అయితే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందే కొన్ని ఫీచర్లు ఇంటర్నెట్లో (Xiaomi 12 Ultra specs in online) లీకయ్యాయి.
undefined
భారీ రియర్ కెమెరాతో ఈ ఫోన్ రానున్నట్లు ఇంటర్నెంట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. షావోమి 12 అల్ట్రా మోడల్లో క్వార్డ్ కెమెరా సెటప్ ఉండొచ్చని తెలుస్తోంది. లెయికా కెమెరాల మోడల్‌తో ఇది రానున్నట్లు (Xiaomi 12 Ultra Cameras) తెలిసింది. ఇందులో 5x పెరిస్కోప్ లెన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఈ లెన్స్ హై ఆప్టికల్ జూమ్ కోసం ఉపయోగపడునుంది. ఈ ఫీచర్ ఉండటం నిజమేతే.. ఈ లెన్స్‌తో రానున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. ఎందుకంటే.. ప్రస్తుతం వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో అత్యధికంగా 3.3x ఆప్టికల్ జూమ్ ఉంది.
ఇక ముందు వైపు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉండనుందట. రియర్ కెమెరా రౌండ్ షేప్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక 6.6 అంగుళాల అమోల్డ్ 2కే, స్పోర్ట్ కర్వ్డ్ డిస్ప్లేతో ఈ ఫోన్లో అందుబాటులోకి రానుందంట. క్వాల్కమ్ 8 జెన్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ విషయంపై మాత్రం కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. మరి ఈ ఫోన్ ధర ఎంత ఉండనుంది..? ఇంకా ఎలాంటి క్రేజీ ఫీచర్లను ఇందులో పొందు పరిచారు అనే విషయం తెలియాలంటే.. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.