Vivo Y33T:హోలీ సందర్భంగా వివో వై33టి స్పెషల్ కలర్ వేరియంట్.. ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చేసింది..

By asianet news telugu  |  First Published Mar 16, 2022, 12:26 PM IST

వివో తాజాగా హోలీ పండగ సందర్భంగా వివో  వై33టి కొత్త కలర్ లో ప్రవేశపెట్టింది, దీని ధర రూ. 18,990గా ఉంచారు.  ఈ ఫోన్  8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ వేరియంట్‌తో పరిచయం చేసారు. కొత్త కలర్ వేరియంట్ ధర మాత్రం కొత్తది కాదు.


వివో ఇండియా ఈ ఏడాది జనవరిలో వివో వై33టిని ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఫోన్ మిడ్‌డే డ్రీమ్ అండ్ మిర్రర్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉండేది అయితే ఇప్పుడు  వివో వై33టి(Vivo Y33T) స్టార్రి గోల్డ్ కలర్‌లో కూడా ప్రవేశపెట్టరు. Vivo Y33Tని ఇప్పుడు మిడ్‌డే డ్రీమ్, మిర్రర్ బ్లాక్ అండ్ స్టార్రీ గోల్డ్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. వివో వై33టిలో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఇచ్చారు, అంతేకాకుండా ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్.

వివో వై33టి ధర
 వివో వై33టి ధర రూ. 18,990.  దీనిని 8జి‌బి ర్యామ్  128జి‌బి స్టోరేజ్ వేరియంట్‌తో పరిచయం చేశారు. కొత్త కలర్ వేరియంట్ ధర కొత్తది కాదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో స్టోర్ల నుండి ఫోన్ విక్రయాలు జరుగనున్నాయి.

Latest Videos

undefined

వివో వై33టి స్పెసిఫికేషన్లు
వివో వై33టి FunTouch OS 12తో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది, దీని రిజల్యూషన్ 1080x2408 పిక్సెల్‌లు. డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్‌లో ఇచ్చారు. ఇందులో 4 జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సౌకర్యం కూడా ఉంది. 

వివో వై33టి కెమెరా 
వివో వై33టి కెమెరా మూడు బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు ఎపర్చరు f/1.8 ఉంది.
రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

వివో వై33టి బ్యాటరీ
కనెక్టివిటీ కోసం వివో ఫోన్‌లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/A-GPS, ఎఫ్‌ఎం రేడియో, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్ బరువు 182 గ్రాములు.

click me!