వ్యూ వన్స్ అనేది రిసీవర్ ఇమేజ్‌లు, వీడియోలను ఒక్కసారి మాత్రమే చూడడానికి అనుమతించే ఫీచర్. ఈ ఓపెన్ కంటెంట్ స్క్రీన్‌షాట్ తీయడం లేదా సేవ్ చేయడం సాధ్యం కాదు.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. వాట్సాప్ ఒక్కసారి మాత్రమే వినగలిగే ఆడియో మెసేజ్ అండ్ iPhone వినియోగదారుల కోసం వీడియో మెసేజ్ పంపే ఆప్షన్ ప్రవేశపెట్టింది. Play Once Audio అనే కొత్త ఆప్షన్ WhatsAppలో View Ones ఆప్షన్‌ను పోలి ఉంటుంది. రిసిపియంట్ ఒక్కసారి మాత్రమే వినగలిగే విధంగా వాయిస్‌ని పంపడం దీని ప్రత్యేకత.
వ్యూ వన్స్ అనేది రిసీవర్ ఇమేజ్‌లు, వీడియోలను ఒక్కసారి మాత్రమే చూడడానికి అనుమతించే ఫీచర్. ఈ ఓపెన్ కంటెంట్ స్క్రీన్‌షాట్ తీయడం లేదా సేవ్ చేయడం సాధ్యం కాదు. Play Once ఆప్షన్ తో ఆడియో మెసేజెస్ సేవ్ చేయడం, షేర్ చేయడం లేదా రికార్డ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఆప్షన్ త్వరలో WhatsApp బీటా టెస్టర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆపై యూజర్లలందరికీ అందుబాటులోకి వస్తుంది.
undefined
Play Onceతో పరిచయం చేయబడిన మరో ఫీచర్ షార్ట్ వీడియో మెసేజ్. ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లను లక్ష్యంగా తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ద్వారా ఐఫోన్ వినియోగదారులు 60 సెకన్ల వరకు చిన్న వీడియో మెసేజ్ పంపవచ్చు. Wabetinfo నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ ఆడియో మెసేజ్ లాగానే పనిచేస్తుంది.
వీడియో మెసేజ్ రికార్డ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు కెమెరా బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. ఈ వీడియో మెసేజ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. Play Ones ఫీచర్ కాకుండా, ఈ చిన్న వీడియో మెసేజ్ సేవ్ చేయబడవు లేదా ఫార్వార్డ్ చేయబడవు. కానీ మీరు మెసేజ్ స్క్రీన్‌షాట్ తీయవచ్చు లేదా స్క్రీన్‌ను రికార్డ్ చేయవచ్చు.