వాట్సాప్ గ్రూప్ చాట్లో పెద్ద మార్పు.. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి..

By Ashok Kumar  |  First Published Jul 3, 2024, 1:22 PM IST

గతంలో వాట్సాప్ ట్రాన్స్‌క్రైబ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ఏంటంటే  రికార్డ్ చేసిన వాయిస్ మెసేజెస్  టెక్స్ట్‌గా మార్చగలదు. ఇంకా  ట్రాన్స్లేట్ చేయగల కొత్త ఫీచర్. ఈ ఫెసిలిటీ మొదట్లో హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ & ఇంగ్లీషు సహా కొన్ని భాషల్లో అందుబాటులో ఉంది. 


ఇంతకుముందు వాట్సాప్ కమ్యూనిటీ చాట్‌లలో మాత్రమే ఉన్న క్రియేట్ ఈవెంట్ ఫీచర్ ఇప్పుడు సాధారణ గ్రూప్ చాట్‌లలో కూడా వచ్చింది. పేరు, వివరాలు, తేదీ, లొకేషన్, వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ సర్వీసెస్  వంటి ఈవెంట్ సమాచారాన్ని కూడా ఈ ఫీచర్‌తో చూడవచ్చు. నివేదికల ప్రకారం, ఫోటో, డాక్యుమెంట్, ఆడియో, కాంటాక్ట్ & లొకేషన్‌ను పంపించానికి పేపర్ క్లిప్ అప్షన్స్ లో ఇప్పుడు మార్పు ఉంటుంది. ఏంటంటే ఈవెంట్‌ని క్రియేట్ చేసే ఆప్షన్ కూడా ఇందులో చూడవచ్చు. ఈవెంట్‌ను క్రియేట్ చేసిన  తర్వాత, దానిని గ్రూప్ మెంబర్స్ చూడవచ్చు & యాక్సెప్ట్ చేసే ఫీచర్ ఇందులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.

Latest Videos

గతంలో వాట్సాప్ ట్రాన్స్‌క్రైబ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ఏంటంటే రికార్డ్ చేసిన వాయిస్ మెసేజెస్  టెక్స్ట్‌గా మారుస్తుంది. ఇంకా  ట్రాన్స్లేట్ కూడా చేయగల కొత్త ఫీచర్. ఈ ఫెసిలిటీ మొదట్లో హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ & ఇంగ్లీషుతో పాటు కొన్ని భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ WhatsApp  2.24.7.8 Android బీటా వెర్షన్‌లో టెస్టింగ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫీచర్  యాప్‌లో వాయిస్ ట్రాన్స్‌క్రిప్ట్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్‌ని తెస్తుంది. దీంతో యాప్ వాయిస్ మెసేజెస్ ట్రాన్స్‌క్రైబ్ చేయగలదు. ఈ ఫీచర్  ప్రాసెసింగ్ ఫోన్‌లోనే జరుగుతుంది. వాయిస్ మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ కచ్చితం చేయడంలో  సహాయపడుతుందని చెబుతున్నారు.

రోజూ ఫోటోలు, వీడియోలను పంపే వారికి సహాయం చేయడానికి యాప్ ఒక కొత్త అప్ డేట్ కూడా పరిచయం చేసింది. అదే మీడియా ఫైల్ క్వాలిటీ ప్రీసెట్ చేయడానికి ఒక  అప్షన్. దీని ద్వారా ప్రతి ఫైల్‌కు HD మోడ్‌ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని కోసం మీడియా అప్‌లోడ్ క్వాలిటీ ఆప్షన్‌కి వెళ్లి HD అప్షన్ సెలెక్ట్ చేసుకొని సెట్ చేయండి. యాప్‌ ఓపెన్ చేసి, సెట్టింగ్‌లలో స్టోరేజ్ & డేటా అప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు 'మీడియా అప్‌లోడ్ క్వాలిటీ' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్‌డీ క్వాలిటీ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. వీటి నుండి HD క్వాలిటీ  సెలెక్ట్ చేసుకోవడం ద్వారా బెస్ట్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలను మీరు ఇతరులకు షేర్ చేయవచ్చు.

click me!