WhatsApp New Feature: వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌.. అదేంటంటే..?

By team telugu  |  First Published May 6, 2022, 5:22 PM IST

తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ ప్రవేశపెడుతోంది.


ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ ప్రవేశపెడుతోంది. గతంలోనే వాట్సాప్ రియాక్షన్స్ ఫీచర్‌ (Reactions) ఫీచర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. వాట్సాప్ యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా (Reactions Feature) ఈ విషయాన్ని ధృవీకరించారు.

వాట్సాప్ కొత్త ఫీచర్ల లిస్టును ఇప్పటికే వెల్లడించింది. మరో పోటీదారు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్  తమ ప్లాట్ ఫాంపై iMessage మెసేజింగ్ తీసుకొచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ Instagram తమ యూజర్లకు ఎమోజీలతో మెసేజ్‌లను పంపేందుకు ఈ ఫీచర్‌ను అందిస్తోంది. ఇప్పుడు WhatsApp చాలా ఆలస్యంగా తమ యూజర్లకు Reactions Feature అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌లో కొత్త రియాక్షన్స్ ఫీచర్ ద్వారా ముందుగా యూజర్లకు Like, Love, Laugh, Surprise, Sad, Thanks వంటి 6 ఎమోజి రియాక్షన్లు మాత్రమే పొందుతారని నివేదిక వెల్లడించింది.

Latest Videos

undefined

భవిష్యత్తులో వాట్సాప్ యూజర్లకు అన్ని ఎమోజీలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతానికి బీటా టెస్టింగ్ యాప్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఎమోజీలు మాత్రమే కాకుండా మెసేజింగ్ యాప్‌లో GIFలు లేదా స్టిక్కర్‌లను ఉపయోగించడానికి యూజర్లను వాట్సాప్ అనుమతించనుంది. ఒకవేళ వాట్సాప్ యూజర్లకు ఇంకా ఈ ఫీచర్‌ కనిపించకపోతే.. మెసేజ్ రియాక్షన్‌లు మెసేజ్ దిగువన చూడొచ్చునని నివేదిక వెల్లడించింది. వాట్సాప్ ఎట్టకేల‌కు రియాక్షన్స్ ఫీచ‌ర్‌ను యూజ‌ర్లకు అందుబాటులోకి తేనుంది. తొలుత యూజ‌ర్లు రియాక్షన్ మెసేజ్ పంప‌డానికి ఆరు ఏమోజీలు పొందొచ్చు. లైక్‌, ల‌వ్‌, లాప్‌, స‌ర్‌ప్రైజ్‌, శాడ్‌, థ్యాంక్స్ ఎమోజీలు ఈ జాబితాలో ఉన్నాయి. అన్ని ర‌కాల ఏమోజీలు వాడే అవకాశం భ‌విష్యత్‌లో రావొచ్చు. వాటిలో కొన్ని బీటా టెస్టింగ్‌కు వినియోగిస్తున్నారు. దీనికి అద‌నంగా యాప్‌లోని జిఫ్‌లు, స్టిక్కర్లు కూడా యూజ‌ర్లు వినియోగించవచ్చు.

WhatsApp రియాక్షన్లను ఎలా ఉపయోగించాలి..?

1. మీరు ముందుగా WhatsApp ఓపెన్ చేయండి. ఏదైనా మెసేజ్ రియాక్షన్లను ఉపయోగించే చాట్‌ ఓపెన్ చేయాలి.
2. మీరు ఏ మెసేజ్ కు రియాక్షన్ పంపాలో దాన్ని గట్టిగా నొక్కి పట్టుకోండి.
3. అప్పుడు మీకు 6 ఎమోజీలతో కూడిన ఒక పాప్-అప్‌ కనిపిస్తుంది.
4. ఎమోజి రియాక్షన్‌ని పంపాలంటే.. పాప్-అప్ మెనులోని 6 ఎమోజీలలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుంటే చాలు..!

click me!