WhatsApp Scam:ఈ మెసేజ్‌ని వెంటనే డిలీట్ చేయండి, రిప్లై ఇవ్వడంలో పొరపాటు చేయకండి..

By asianet news telugu  |  First Published Apr 25, 2022, 3:47 PM IST

వాట్సాప్ సపోర్ట్ పేరుతో వ్యక్తులకు పంపుతున్న మెసేజ్‌లలో వెబ్ లింక్ కూడా ఉంది, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతు మోసాలకు పాల్పడుతున్నారు.
 


ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మల్టీమీడియా మెసేజింగ్ యాప్ WhatsApp అని మీకు తెలుసు. ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వాటి పేరుతో మోసాలు కూడా జరుగుతున్నాయి. వాట్సాప్‌ విషయంలోనూ అదే పరిస్థితి. వాట్సాప్ పేరుతో కొత్త కొత్త మోసాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు వాట్సాప్ పేరుతో ఒక భారీ మోసం జరుగుతున్నట్లు సమాచారం.

వాట్సాప్ పేరుతో మోసం ఎలా జరుగుతోంది?
నిజానికి  సైబర్ దుండగులు వాట్సాప్ పేరుతో ఒక  కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఈసారి దుండగులు వాట్సాప్ సపోర్టు పేరుతో ప్రజలకు కొత్తగా  మెసేజ్‌లు పంపుతున్నారు. వాట్సాప్ సంస్థ స్వయంగా వారిని సంప్రదించినట్లు ప్రజలు భావించి వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ దుండగులు వాట్సాప్ సపోర్ట్ పేరుతో వ్యక్తులకు పంపుతున్న మెసేజ్‌లలో వెబ్ లింక్ కూడా ఉంది, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఒక ఫారమ్‌ ఓపెన్ అవుతుంది. అందులో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారు.

Latest Videos

వేరిఫైడ్ ప్రొఫైల్ ఉపయోగించబడుతుందా?
ఈ దుండగులు చాలా తెలివిగా వెరిఫైడ్ అకౌంట్లను వాడుతున్నారు. నిజానికి వీరు WhatsApp బిజినెస్ అక్కౌంట్ ఉపయోగిస్తున్నారు. దీంతో వాట్సాప్ సంస్థ వాటిని ధృవీకరించింది. ఇప్పుడు ఈ వ్యక్తులు వాట్సాప్ సపోర్ట్ పేరుతో మెసేజ్ చేస్తున్నప్పుడు, ప్రజలు వేరిఫైడ్ అక్కౌంట్ అని చూస్తున్నారు, దీంతో వాట్సాప్ వారికి నిజంగా మెసేజ్ చేసిందని ప్రజలు భావిస్తున్నారు, అయితే నిజం ఏమిటంటే వాట్సాప్ ఎప్పుడూ వినియోగదారులకు మెసేజ్ చేయదు ఇంకా  ఏదైనా ఫీచర్ గురించి మెసేజ్ పంపినప్పటికీ వ్యక్తిగత సమాచారాన్ని అడగదు. కాబట్టి  మీకు కూడా అలాంటి మెసేజ్‌లు వస్తే  వెంటనే డిలీట్ చేసి ఇతరులకు తెలియజేయడం మంచిది.

click me!