వాట్సాప్ కొత్త అప్ డేట్.. ఇప్పుడు టైప్ చేయకుండానే మెసేజ్.. వారికీ వరం లాంటిది.. !

By Ashok kumar SandraFirst Published Jun 18, 2024, 2:15 PM IST
Highlights

 సైన్టిఫిక్ గా  అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి  వాట్సాప్ బెస్ట్ మార్గాలలో ఒకటి.
 

సెల్‌ఫోన్‌ల కాలంలో మీరు రోజుకు 100 టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే పంపగలరు. అది 90వ దశకం పిల్లల స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ప్రతి మెసేజ్ చెక్ చేసి పంపే రోజులు  అవి. కానీ నేటి కాలంలో ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకోవడానికి ఎటువంటి లిమిట్ లేదు. 

 మనం నేడు వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో రకరకాల అప్లికేషన్లు వచ్చాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ యాప్  మెసేజ్ సేవలను నిరంతరం మెరుగుపరుస్తుంది. 

Latest Videos

భారత్‌లో 50 కోట్ల మందికి పైగా వాట్సాప్‌ను వాడుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో వాట్సాప్ కంపెనీ త్వరలో ఓ కొత్త ఫీచర్‌ను అమలు చేయబోతోందని కొంత సమాచారం బయటకు వచ్చింది. అదే టైప్ చేయకుండా  మనం మాట్లాడితే మెసేజుల మార్చుకునే ఫీచర్. 

ఇప్పటికే మన మొబైల్ ఫోన్ కీబోర్డులో ఈ సదుపాయం  ఉన్నప్పటికీ, వాట్సాప్ దీని కోసం ప్రత్యేక ఫీచర్‌ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీని ప్రకారం మనం తమిళంలో మాట్లాడితే ఇంగ్లీషులోకి, ఇంగ్లీషులో మాట్లాడితే తమిళంతో పాటు ఇతర  భాషల్లోకి అనువదించి మెసేజుగా మార్చే విధానాన్ని whatsapp త్వరలో తీసుకువస్తోంది.

మెసేజుని టైప్ చేయడానికి టైం లేని వాయిస్ నోట్ పంపేవారికి ఇది భారీ వరం అని భావిస్తున్నారు. అయితే, ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ లోనే  ఉంది. త్వరలో దీనిని  అప్ డేట్ చేయవచ్చు.

click me!